ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించాలంటే ప్రతిపక్ష హోదా కావాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్  

అమరావతి:  ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను స‌భ‌లో వినిపించాలంటే వైయ‌స్ఆర్‌సీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కావాల‌ని  ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మూడు పార్టీలు ఒకవైపు ఉంటే, వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల పక్షాన ఉంద‌ని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించడానికి ప్రతిపక్ష హోదా అవసరమని, కానీ మూడు పార్టీలు ప్రజల గొంతు విన్నీ చేయకుండా అడ్డుపడుతున్నాయని విమర్శించారు. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది, కానీ ఏపీలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని చెప్పారు.

ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను మాత్రమే గ‌వర్న‌ర్‌ చదువుతున్నారని, తన ప్రసంగంలో వాస్తవమా కాదా అనే అంశాన్ని గవర్నర్ పరిశీలించడం లేదని పేర్కొన్నారు.  బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీల నేతలు “పందికొక్కుల్లా మారి దోచుకుంటున్నారంటూ” రాష్ట్రాన్ని దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం‌గా మార్చారంటూ విమర్శించారు. 

Back to Top