అమరావతి:వైయస్‌ఆర్‌సీపీ ఏపీలో తిరుగులేని మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించిందని తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి అన్నారు.ప్రజల సమస్యలను పరిష్కరించి సువర్ణ పాలన అందించాలనే లక్ష్యంతో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు.పాదయాత్రతో కోట్లాది ప్రజలను కలుసుకుని వారికి కొండంత భరోసా కలిగించారని తెలిపారు.వైయస్‌ఆర్ ఎల్పీ నేతగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నిక పట్ల అభినందనలు తెలిపారు. ప్రజలందరికి మేలు చేస్తారు: ఎమ్మెల్యే చిన్న అప్పల నాయుడు ప్రజలందరి మేలు జరిగే విధంగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తారని బొబ్బిలి ఎమ్మెల్యే చిన్న అప్పలనాయుడు అన్నారు.ప్రజలందరూ ఆకాంక్షల మేరకు గొప్ప పరిపాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ప్రభంజనంతోనే గెలుపు: ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని 2014 నుంచి ప్రజలు ఎదురుచూశారని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు.చంద్రబాబు అవినీతి,అరాచకాలతో ప్రజలు విసిగిపోయారన్నారు.వైయస్ జగన్ ప్రభంజనంలోనే గాజువాక ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రజల కోసం వైయస్‌ఆర్‌సీపీ చేసిన పోరాటాలే గెలిపించాయని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఏపీలో సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుందన్నారు.ఏపీ చరిత్రలో ఇంతటి జనాదరణ ఏ నాయకుడికి లభించలేదని..అది ఒక వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు.వైయస్ జగన్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు అందరం చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. కష్టపడి పనిచేస్తాం: ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి నడవడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు.వైయస్ జగన్ ప్రతినిధులుగా మాకు ప్రజలందరూ ఓటు వేసి గెలిపించారని తెలిపారు.ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తామని తెలిపారు. ప్రత్యేకహోదా సాధనకు కలిసికట్టుగా పనిచేస్తాం: ఎంపీ నందిగామ సురేష్ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశనిర్దేశం బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ అన్నారు.ప్రత్యేకహోదా, విభజన హామీలు సాధనలో ఎంపీలందరూ కలిసికట్టుగా పనిచేయాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారని చెప్పారు