అమరావతి: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా సమావేశానికి హాజరుకావడంతో తాడేపల్లిలోని వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం కళకళలాడుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైయస్ఆర్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకుల రాకతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. వైయస్ జగన్‌ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో కొద్ది సేపటి క్రితమే భేటీ అయ్యారు. సమావేశంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాకతో జగన్ నివాసం వద్ద వాతావరణం సందడి మారింది.