నీచ రాజకీయం కోసం పల్నాడును వాడుకోవద్దు

చంద్రబాబుపై  వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు ఫైర్‌

గుంటూరు: నీ నీచ రాజకీయం కోసం పల్నాడు ప్రాంతాన్ని వాడుకోవద్దు. ఆ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిలు సూచించారు. గుంటూరు వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలోని అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు ఏనాడైనా పల్నాడు వెళ్లాడా..? ప్రజల యోగక్షేమాల గురించి విచారించారా..? అభివృద్ధికి ఒక శంకుస్థాపనలు చేశారా..? అని ప్రశ్నించారు. అలా చేసి ఉంటే ముఠా కక్షలు ఎప్పుడూ ఉండేవి కాదదన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత వర్షాలు పడడంతో రైతులు, రైతు కూలీలు, పేదలు ఎక్కువగా ఉన్న పల్నాడు వారి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. కేవలం యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాద్‌ అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నాడన్నారు. ఆత్మకూరులో అసలు ఏం గొడవ జరిగింది. ఎప్పుడు జరిగింది. ఎందుకు జరిగింది.. ఎంత మంది శిబిరంలో ఉన్నారని చూస్తే వచ్చినవారిలో పెయిడ్‌ ఆర్టిస్టులే ఉన్నారన్నారు. నిన్న రాత్రి చంద్రబాబు శిబిరంలో 30 మంది ఉన్నవారు తెల్లవారే సరికి 200 మంది ఎలా అవుతారని ప్రశ్నించారు. 
ఏం చెప్పినా నమ్మేస్తారని బాబు కుట్ర : పీఆర్కే
పల్నాడు ఫ్యాక్షన్‌ ఏరియా ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవను పార్టీలకు పూసి కావాలనే గందరగోళం సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏమాత్రమేనా ఇంగింతం ఉంటే నీ రాజకీయం కోసం మా ప్రాంతంలో అల్లకొల్లోలం చేయొద్దని కోరారు. 
బాబు ఏం అర్హత ఉంది: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
ఆందోళన చేయడానికి చంద్రబాబుకు ఏం అర్హత ఉందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. ఉన్నది 50 కుటుంబాలు అయితే శిబిరంలో 150 కుటుంబాలు ఉన్నట్లుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఏదో ఒకటి సృష్టించి మీడియాలో కనిపించాలని, ప్రజలను మభ్యపెట్టాలనేదే చంద్రబాబు ప్రయత్నమన్నారు. ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాలపై బాధితులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 

Back to Top