దేవినేని ఉమకు ధర్నా చేసే అర్హత లేదు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌
 

కృష్ణా: ఇసుక నుంచి తైలం ఎలా తీయొచ్చో దేవినేని ఉమకు బాగా తెలుసు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. దేవినేని ఉమకు ధర్నా చేసే అర్హత లేదన్నారు. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీ చేసి కోట్ల సంపాదించారన్నారు. ప్రభుత్వ ఆదాయానికి దేవినేని ఉమ లాంటి వ్యక్తులు గండికొట్టారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇసుక దందాపై స్టే విధిస్తే ఆ పార్టీ నాయకులే సుప్రీంను ఆశ్రయించారని గుర్తుచేశారు. ఎన్జీటీ వద్ద దేవినేని ఉమ ఇసుక దోపిడీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు దేవినేని ఉమ ఆరాటపడుతున్నాడన్నారు.

Back to Top