ఈఎస్‌ఐ స్కామ్‌లో బాబు, లోకేష్‌ల‌ పాత్ర కూడా ఉంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

తాడేపల్లి: గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా దోపిడీ జరిగిందని, అన్ని శాఖల్లోనూ అవినీతికి పాల్పడ్డారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. తన హయాంలో దోపిడీలను దగ్గరుండి ప్రోత్సహించిన చంద్రబాబు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులను అరెస్టు చేస్తుంటే చంద్రబాబుకు భయంపట్టుకుందన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి ట్రావెల్స్‌ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని, జేసీ ట్రావెల్స్‌ అక్రమాలపై ఆధారాలతోనే జేసీ ప్రభాకర్‌రెడ్డిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్‌ పాత్ర కూడా ఉందని, రానున్న రోజుల్లో మరింత మంది అరెస్టు అవుతారన్నారు. 
 

Back to Top