తాడేపల్లి: టీడీపీ నేత నారా లోకేష్ నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి వెళ్ళి నారా లోకేశ్ మాట్లాడిన భాషను రాష్ట్ర ప్రజలంతా చూశారని చెప్పారు. ఇలాంటి కొడుకును కన్నందుకు నిజంగా చంద్రబాబు సిగ్గుపడాలి. విదేశాల్లోని యూనివర్శిటీల్లో చదవించి, ఇంత సంస్కార హీనుడిగా పెంచినందుకు చంద్రబాబు లెంపలు వేసుకుని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాంటి భాషను మాట్లాడే కొడుకును ప్రోత్సహిస్తున్న చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. సీఎం వైయస్ జగన్‌పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను సుధాకర్‌బాబు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో టీజేఆర్ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రజా నాయుడుకు అయిన వైయస్ జగన్‌మెహన్‌రెడ్డిగారిని నోటికొచ్చినట్లు తూలనాడటం ఎక్కడ సంస్కృతి. ఓ మాజీ సీఎం తనయుడిగా, కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇంత దిగజారుడు మాటలు మాట్లాడటం అనేది ఇంతవరకూ రాష్ట్ర చరిత్రలో జరగలేదు. భవిష్యత్‌లో కూడా ఇటువంటివి జరగవేమో. దొడ్డిదారిన లభించిన ఎమ్మెల్సీ పదవి పోతుందని నారా లోకష్ తీవ్ర నిరాశలో ఉన్నారు. శరీరం సైజు తగ్గినా లోకేష్ బుద్ధి మాత్రం మారలేదు. గత కొద్దిరోజులుగా నారా లోకేష్ బాగా ఫ్రస్ట్రేషన్‌లో ఉంటున్నారు. దానికి కారణాలు ఏంటని పరిశీలన చేస్తే.. ఒకటిః త్వరలో ఎమ్మెల్సీ పదవి పోబోతుంది. రెండుః మంగళగిరిలో ఓడిపోయి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకుంటూ హైదరాబాద్‌లో బతుకుతున్న ఆయనకు... తెలంగాణలో టీడీపీకి చెందిన రాష్ట్ర నేత పార్టీకి రాజీనామా చేయట, అక్కడ పార్టీ మూసేయటం, తదుపరి ఆంధ్రప్రదేశ్ లో తమ పరిస్థితి ఏమిటన్న బాధలో నుంచి ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్ళి ఉంటుంది. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి కుమారుడు జగన్ మోహన్ రెడ్డిగారు, సొంత బలంతో, స్వశక్తితో గొప్ప నాయకత్వ లక్షణాలతో మహా నాయకుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో తన పరిపాలన సామర్థ్యంతో, దేశం మొత్తం తన వైపునకు తిప్పుకుని చరిత్రను సృష్టిస్తుంటే... నారా లోకేష్ మాత్రం తల్లిచాటు బిడ్డగా, భార్యచాటు భర్తగా, పనికిమాలినివాడిగా మిగిలిపోతున్నారు. - ఎమ్మెల్సీ పదవి పోతుంది... ఎమ్మెల్యేగా మంగళగిరిలో ఓడిపోయాడు.. కనీసం పార్టీ అధ్యక్ష స్థానం అయినా తండ్రి చంద్రబాబు ఇస్తారేమో అని చూస్తుంటే... అది కూడా దక్కకపోవడంతో... చుట్టూ ఉన్న అన్ని దారులూ మూసుకుపోయాయి. - ఓవైపు పార్టీలో నమ్మకం లేదు. తండ్రి, తల్లి, భార్య దగ్గర కూడా నారా లోకేష్ నమ్మకం సంపాదించుకోలేదు. మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నియోజకవర్గ ప్రజలు ఛీత్కరించి ఓడించారు. - లోకేష్ ను ఓ పనికిమాలిన వాడిగా ఆంధ్రరాష్ట్రంలో సామాన్యులు కూడా మాట్లాడుకుంటున్నారు. దీంతో అన్నిరకాల ఫ్రస్టేషన్‌తో లోకేష్...ఈరోజు ముఖ్యమంత్రిపై నోరుజారి, దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపై లోకేశ్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. బహుశా రాత్రి ఇంట్లో, నారా లోకేష్‌ను ఆయన భార్య బ్రాహ్మణి కొట్టడం అన్నా, తిట్టడం అన్నా జరిగి ఉండాలి. అందుకే ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్‌లోకి వచ్చి ఉంటంది. తెలుగు సినిమాలో బ్రహ్మానందం ఫ్రస్ట్రేషన్ ... ఫ్రస్ట్రేషన్.. అని మొహం తిప్పుకుంటూ మాట్లాడినట్లు... లోకేష్ కూడా అదే తరహాలో మాట్లాడారు. అందుకే నేను ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టి, తోటి శాసనసభ్యుడిగా, వయసులో పెద్దవాడిగా, సోదరుడిగా లోకేష్‌కు హితవు చెబుతున్నారు. "ఒరేయ్ లోకేష్. పనికిమాలిన చెత్త వెధవ. చవట, దద్దమ్మ. కనీసం ఓ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా గెలవలేవు. ఎమ్మెల్యేకు తక్కువ.. కార్పొరేటర్‌కు ఎక్కువ అయిన నువ్వు వైఎస్‌సార్ గారి తనయుడిని ఓరేయ్ అని సంభోదిస్తావా? నేను వయసులో పెద్దవాడిని నీకు అర్ధమయ్యే భాషలో చెబితేనే అర్థం అవుతుందని చెబుతున్నా. ఒరేయ్ లోకేష్. పనికిమాలిన చెత్త వెధవ. చవట. దద్దమ్మ అనే పదాలకు అర్థాన్ని నిఘంటువులో వెతుక్కో. లేకపోతే నీకు స్క్రిప్ట్ రాసిన వారితో చెప్పించుకో. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఒరేయ్ అని సంభోదించిన బుద్ధి హీనుడా. నీకు లోకజ్ఞానం ఎలాగు లేదు. రాజకీయాల్లో రాణించడం చేతగాక... జనాలపై మీదపడి ఇష్టానుసారంగా మాట్లాడతావా?" గత రెండేళ్ల నుంచి వైయస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా సుపరిపాలన జరుగుతున్న సందర్భంలో మేమందరం గౌరవ ముఖ్యమంత్రిగారు నేర్పించిన పాఠాలను త్రికరణశుద్ధిగా, న్యాయం, నీతి, ధర్మంతో ఏ పార్టీ అయినా... ఇతర పార్టీ నేతలను దుర్భాషలాడటంకానీ, నోరు జారడం కానీ చేయడం లేదు. మేము అంతా జగన్‌మోహన్‌రెడ్డి గారి స్కూల్. మేమంతా వారి విద్యార్థులం. మరి నువ్వేమో నారా చంద్రబాబుగారి స్కూల్, ఆయన స్కూల్ విద్యార్ధివి. అటుఇటుగానివాడివి. విద్యార్థివో, కొడుకువో.. నీది పాత్రో మాకు తెలియడం లేదు. ఇటువంటి పదాలను, భాషను ఉచ్ఛరించడానికి నా మనసు అంగీకరించకపోయినా.. నీకు అర్థం అయ్యే భాషలో చెప్పాలనే ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, నువ్వు మాట్లాడిన మాటలను గుర్తు చేయడం కోసం చెబుతున్నాను. ఓ ప్రజా నాయకుడిపై నోరు జారితే ... ప్రతిచర్య ఎలా ఉంటదో, ప్రతిధ్వని ఉంటదో నీ చెవిలో పడాలని, నీకు బుద్ధి, లోకజ్ఞానం రావాలని ఒరేయ్ లోకేష్.. ఈ విధమైన భాషను ఉపయోగిస్తున్నాను. లోకేష్ ఏమంటున్నావు..? మగాడివైతే అని మాట్లాడుతున్నావ్. ఒరేయ్ లోకేష్.. నువ్వు ఎవరి గురించి మాట్లాడతావ్ రా...! దమ్ము, ధైర్యం ఉండబట్టే సోనియా గాంధీనే శ్రీ వైఎస్ జగన్ ఎదురించారు. దమ్ము, ధైర్యంతో ఆ పార్టీకి రాజీనామా చేసి.. తన స్వశక్తితో సొంత పార్టీ పెట్టి 151మంది ఎమ్మెల్యేలు, 21మంది ఎంపీలనుతో గెలిచారు. అలాంటి నాయకుడ్ని పట్టుకుని మగవాడివా.. అని సంబోధిస్తావా? హత్యా రాజకీయాల గురించి నువ్వు మాట్లాడతావా? మీ నాన్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హత్యా రాజకీయాలకు తెరలేపింది మీరు కాదా? పత్తికొండ మా పార్టీ ఇన్ చార్జి నారాయణరెడ్డిని సుపారీ ఇచ్చి హత్య చేయించిది మీ తండ్రీకొడుకులు కాదా..? ఇప్పుడు పాణ్యం నియోజకవర్గంలో రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలతో హత్యలు జరిగితే దాన్ని కూడా రాజకీయం చేస్తారా? హత్యలను ఈ ప్రభుత్వం సమర్థించడం లేదు. ఈహత్యలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, హంతకులను శిక్షించాలని, హతుల కుటుంబాలకు న్యాయం జరగాలని మేం ఆకాంక్షిస్తున్నాం. హత్యా రాజకీయాలు అంటే.. వంగవీటి మోహన్ రంగా దగ్గర నుంచి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య వరకూ జరిగిన హత్యలన్నీ ఓ పుస్తకం రాయవచ్చు. కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడా? మరి మీ మామ హైదరాబాద్‌లో తుపాకీ పేల్చారు కాదా. ఆయన కూడా తుపాకీతోనే చస్తాడు అని.... అలాగే మీ అయ్య మామను వెన్నుపోటు పొడిచాడు కదా, ఆయన కూడా అలాగే చస్తాడని చెప్పు. ప్రజా బలంతో ఎదిగిన నాయకుడిని తూలనాడి పాపులర్ అవుదామనుకుంటున్నావేమో... ఇప్పటికే నీకు(లోకేష్) పిచ్చ పాపులారీటి వచ్చింది ‘పప్పు’ అనే పదంతో. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకో రౌడీని తయారు చేసి హత్యా రాజకీయాలు చేసిన మీ నాన్నను ప్రజలు ఎలా మర్చిపోతారు. మీ హయాంలో గుండాగిరితో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. మీ హత్య రాజకీయాలతో మీ పార్టీ రంగు పసుపు కాదు.. ఎరుపు రంగుగా మారింది. - మీరు హత్యా రాజకీయాలు చేసుకుంటూ పోతుంటే... వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన తండ్రిగారిని కొందరు దుర్మార్గులు హత్య చేస్తే, ఆ హంతకులకు మీ తండ్రి చంద్రబాబు ఆశ్రయమిచ్చారు. తన తండ్రిని హత్య చేసినవారిని కూడా క్షమించి వదిలేసిన గొప్ప మనసున్న కుటుంబం వైయస్ ది. ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోట్లతో, హత్యా రాజకీయాలతో, ఆఖరికి దోపిడీ దొంగల ముఠాలతో కూడా విఫల రాజకీయాలు చేసి... మీరు అలాగే మిగిలిపోయారు. అందుకే నీకు ఫ్రస్ట్రేషన్ ...ఫ్రస్ట్రేషన్. నువ్వు ఎంత గొంతు చించుకున్నా... ఏం మాట్లాడినా.. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో నువ్వు ఒక కామెడీ యాక్టర్‌గానే మిగిలిపోతావు. ఎందుకంటే నీవు ఈ భూమి మీద జీవించినంతకాలం రాజకీయ నాయకుడిగా ఎదగలేవు. మైండ్ యువర్ టంగ్ లోకేష్..! మీరు ఒకమాట మాట్లాడితే.. ప్రతిచర్యగా పది మాటలు వస్తాయి, వళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు.