చంద్రబాబు, టీడీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్‌

అమరావతి: గవర్నర్‌ వ్యవస్థను తెలుగుదేశం పార్టీ అపహాస్యం చేసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు దుర్మార్గమని మండిపడ్డారు. రాజ్యాంగానికి విలువ ఇవ్వ‌ని టీడీపీ.. గవర్నర్‌ ప్రసంగ ప్రతులను చించి సభలో దిగజారుడుగా వ్యవహరించిందని మండిపడ్డారు. గవర్నర్‌కు, గౌరవ అసెంబ్లీకి, ప్రజలకు చంద్రబాబు, టీడీపీ నేతలను క్షమాపణలు చెప్పాలన్నారు. టీడీపీ ఇలాగే ప్రవర్తిస్తే 2024లోనూ ప్రజలే వారికి బుద్ధిచెబుతారని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హెచ్చరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top