మహానేత ఆశయ సాధనకు అడుగులు

సీఎం వైయస్‌ జగన్‌ పాలన సువర్ణయుగం అవుతుంది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి అన్నారు. జమ్మలమడుగులో ఫ్యాక్షనిజం రూపుమాపిన మహానుభావుడు వైఎస్సార్‌ అని కొనియాడారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని రైతు దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. రైతులు బాగుండాలని, చదువుకున్నవారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి వైయస్‌ఆర్‌ అని గుర్తుచేశారు. జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు చేపట్టారని, ఆయన మరణాంతరం ఆ ప్రాజెక్టులన్నీ మరుగుపడ్డాయన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు కనీసం ఆ ప్రాజెక్టులను టేకప్‌ చేసి పూర్తి చేసిన దాఖలాలు లేవన్నారు. మహానేత ఆశయాలను సాధించే దిశగా సీఎం వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారన్నారు. 

గండికోట కింద ముంపు గ్రామాలకు చంద్రబాబు రూ. 6.5 లక్షలు ప్రకటిస్తే.. సీఎం వైయస్‌ జగన్‌ రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించారన్నారు. ముద్దనూరు మండలానికి తాగునీరు, సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, మండల పరిధిలోని 18 వేల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చేందుకు మూడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ చెరువులు పెడతామని జననేత చెప్పారన్నారు. మైలవరం మండలంలో డ్యామ్‌ కట్టి దాదాపు 40 ఏళ్లు అవుతున్నా.. ఆ డ్యామ్‌ ఇక్కడి రైతులకు ఏమాత్రం ఉపయోగపడలేదని, మన నీరు మన రైతులకు అందించే విధంగా సీఎం కృషిచేస్తున్నారన్నారు. దొంతికొన నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ చేసి మన చెరువులకు నీరు తీసుకువస్తామని చెప్పారన్నారు. వైయస్‌ఆర్‌ మరణాంతరం ఎస్సార్‌బీసీ అసంపూర్తిగా ఉందని, ఎస్సార్‌బీసీ పూర్తయితే పెద్దపూడెం ప్రజలు సంతోషంగా ఉంటారని, దాన్ని పూర్తి చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. బ్రహ్మణి పరిశ్రమ వస్తే 20 వేల ఉద్యోగాలు వస్తాయి రైతు బిడ్డలంతా ఆనందంగా ఉంటారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో చేనేత కార్మికులు చాలా మంది ఉన్నారని, 40 ఏళ్లు నిండిప చేనేతకు రూ. 3 వేల పెన్షన్‌ ఇస్తామని వైయస్‌ జగన్‌ ప్రకటించారని గుర్తుచేశారు.

Back to Top