మహిళల భద్రతపై  చిత్తశుద్ధిలేని పార్టీ టీడీపీ

విడుదల రజనీ

మహిళల భద్రత గురించి మాట్లాడుతుంటే మన ప్రతిపక్ష నాయకులు సభలో వాళ్లకున్న అనుభవాన్నీ, మర్యాదను కూడా మర్చిపోయి చర్చను పక్కదోవ పట్టించడం చాలా బాధాకరం. దేశవ్యాప్తంగా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో దిశ ఘటన కలవరపెడుతోంది. హైదరాబాద్ లో దిశ అనే డాక్టర్ పై అత్యాచారం ఆపై సజీవదహనం చేసారు. రాంచీలో 25 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం హత్య జరిగాయి. తమిళనాడులో బాలికపై సామూహిక అత్యాచారం, ఛత్తీస్ ఘడ్ లో అత్యాచారం హత్య జరిగాయి. ఒకే రోజు జరిగిన నాలుగు ఘటనలు ఇవి. నవంబర్ 28వ తేదీన జరిగిన దారుణాలే ఇవన్నీ. ఒక్క రోజు వ్యవధిలోనే ఇన్ని ఘటనలు తెరమీదకు వచ్చినాయి అంటే నిత్యం ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో! మహిళలు ఎంత అభద్రతకు గురౌతున్నారో, వారి తల్లిదండ్రులు సమాజంలో చిన్నచూపుకు గురౌతామని భయపడి దాచిపెడుతున్నవెన్నో!

అత్యాచారం చేయడం హత్య చేయడం చాలా సాధారణం అయిపోయాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో హాష్ టాగ్ లతో, ఆ బాధితురాలి పేరుతో షేర్ చేసి సంతాపం వ్యక్తం చేస్తున్నాం. కొద్ది రోజులు మీడియాలో వచ్చాక అంతటితో ఆగిపోతోంది. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెబుతున్న గణాంకాల ప్రకారం ప్రతి పదిహేను నిమిషాలకు ఒక రేప్ జరుగుతోంది. యావరేజ్ గా చూస్తే రోజుకు 92 అత్యాచారాలు జరుగుతున్నాయి. 2017లో దేశంలో నమోదైన రేప్ కేసుల సంఖ్య 33,659. గత పది సంవత్సరాల్లో 2,78,886 అత్యాచారాలు జరిగాయి. వీటిల్లో నాలుగు కేసులకు గాను ఒక్క కేసులోనే నిందితులకు శిక్ష పడుతోంది. మిగిలినవి అలా ఉండిపోతున్నాయి. రిజిస్టర్ అయిన కేసుల్లో 25% తక్కువ కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. 93% కేసుల్లో బాధితులకు నిందితులెవ్వరో కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వాలు దీనిపై మరింత సీరియస్ గా స్పందించాల్సిన అవసరం ఉందని అర్థం అవుతోంది. మహిళలు చాలా అభద్రతా భావంతో ఉంటున్నారు. బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. మహిళా భద్రతపై చర్చజరుగుతుంటే అడ్డుకుంటున్నారు ప్రతిపక్షనేతలు. మహిళల భద్రతపై వారికి లేని చిత్తశుద్ధే వారిని 23 సీట్లతో మూలన కూర్చోబెట్టింది. విజయవాడలో కాల్ మనీ రాకెట్ నడిచింది. 2015లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో టీడీపీ నేతలకు ప్రత్యక్ష ప్రమేయం ఉంది. ఊహకు అందనంత వడ్డీలకు అప్పులిచ్చి, ఆ అప్పులు తిరిగి చెల్లించలేకపోయిన వారి ఆస్తులు లాగేసుకోవడం జరిగింది. లైగింకంగా మహిళలను వారెంత వేధించారో నేటి సభలో వీరి ప్రవర్తన చూస్తుంటేనే అర్థం అవుతోంది. 

Read Also: కేజీ ఉల్లి రూ.25 అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top