పేద పిల్లలతో అక్షరాలు దిద్దించే అక్షయపాత్ర ‘అమ్మఒడి’

విద్యా దీపం పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని జగనన్న నమ్మారు

అందుకే విద్యారంగంపై నాలుగేళ్లలో రూ.66 వేల కోట్లను ఖర్చు చేశారు

ఈరోజు కామన్‌మెన్‌ చదివే ప్రభుత్వ పాఠశాలల్లో హౌస్‌ఫుల్‌ బోర్డులు

అమ్మ ప్రేమ ఎంత గొప్పదో.. అమ్మ ఒడి పథకం అంత గొప్పది

పథకాలను కాపీ కొట్టగలవేమో.. జగనన్న క్రెడిబులిటీ, కమిట్‌మెంట్‌ను కాపీ కొట్టలేవు చంద్రబాబూ..

పార్టీ గుర్తు లేనోళ్లు, ప్రజల్లో గుర్తింపు లేనోళ్లు గుంపులుగా వచ్చినా.. జగనన్న నీడను కూడా తాకలేరు

చంద్రబాబు పొత్తులు, ఎత్తులు, జిత్తులు అన్నీ జగనన్న ప్రజాబలం ముందు చిత్తు కావడం ఖాయం 

కురుపాం గడ్డ వైయస్‌ఆర్‌ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటుంది

కురుపాం బహిరంగ సభలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

పార్వతీపురం మన్యం జిల్లా: చిన్నప్పడు చరిత్రలో చాలా విప్లవాల గురించి చదువుకున్నాం కానీ, చదువుల విప్లవం ఎలా ఉంటుందో వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో కళ్లారా చూస్తున్నామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. గతంలో కార్పొరేట్‌ స్కూళ్ల ముందు, కాన్వెంట్‌ స్కూళ్ల ముందు హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపించేవని, జగనన్న పాలనలో ప్రభుత్వ పాఠశాలల ముందు హౌస్‌ఫుల్‌ బోర్డులు పెడుతున్నారని, గొప్ప మార్పుకు ఇదొక నిదర్శనమని చెప్పారు. రాతలు రాసే బ్రహ్మదేవుడు అమ్మను సృష్టిస్తే.. పేదల తలరాతలను మార్చే అమ్మ ఒడిని మన జగనన్న సృష్టించారన్నారు. వరుసగా నాల్గవ ఏడాది జగనన్న అమ్మ ఒడి పథకం నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు కురుపాం నియోజకవర్గానికి వచ్చిన సీఎం వైయస్‌ జగన్‌కు ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కృతజ్ఞతలు తెలిపారు. కురుపాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. 

‘‘అమ్మ ఒడి సృష్టికర్త, విద్యా దీవెన ఆవిష్కర్త, నాడు–నేడు రూపకర్త, విద్యారంగ సంస్కర్త, పేదల రాతలు మార్చే ప్రజానేత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు కురుపాం నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు. అడిగిన వెంటనే ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసిన సీఎం వైయస్‌ జగన్‌కు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. 

నాల్గవ విడత అమ్మ ఒడి పథకం నిధులు విడదల చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ కురుపాం నియోజకవర్గానికి రావడం చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్‌ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ, గుడిలాంటి బడిలో ఉండాలనే లక్ష్యంతో తీసుకువచ్చిన పథకం జగనన్న అమ్మ ఒడి. దేశాన్ని పరిపాలించిన ప్రధానులు, రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు, పాఠాలు చదివిన విద్యార్థులు ఎవరూ కనీవిని ఎరుగని గొప్ప ఆలోచన అమ్మ ఒడి పథకం. 

మన రాతలు రాసే బ్రహ్మదేవుడు అమ్మను సృష్టిస్తే.. మన జగనన్న పేదల తలరాతలను మార్చే అమ్మ ఒడిని సృష్టించారు. రాష్ట్రంలో సుమారు 42.60 లక్షల తల్లులకు వారి పిల్లలను పనికి పంపకుండా బడికి పంపాలనే గొప్ప ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒక కుటుంబం పేదరికం నుంచి బయటపడాలంటే అందుకు చదువు ఒక్కటే మార్గమని నమ్మిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. అందుకే ప్రతి పేద కుటుంబంలోని పిల్లలకూ చదువులు అందిస్తున్నారు. అమ్మను మించిన దైవం లేదు, అన్నను మించిన ధైర్యం లేదు, అమ్మ ఒడి పథకాన్ని మించిన పథకమే లేదని ప్రతి విద్యార్థి చెప్పుకుంటున్నారు. ఒక దీపం గదికి వెలుగునిస్తుంది.. చదువుల దీపం పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని సీఎం వైయస్‌ జగన్‌ చెబుతుంటారు. అందుకనే అమ్మ ఒడి, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, సీబీఎస్‌ఈ సిలబస్, ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్, బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు, నాడు–నేడుతో 9రకాల సదుపాయాలను కల్పిస్తున్నారు. 

గతంలో కార్పొరేట్‌ స్కూళ్లు, కాన్వెంట్‌ స్కూల్స్‌ముందు హౌస్‌ఫుల్‌ బోర్డులు ఉండేవి. కానీ, ఈరోజు కామన్‌మెన్‌ చదివే ప్రభుత్వ పాఠశాలల్లో హౌస్‌ఫుల్‌æబోర్డులు ఉంటున్నాయి. గతంలో టెన్త్‌ క్లాస్‌లో నారాయణ, శ్రీచైతన్య వారికి మాత్రమే ఫస్ట్‌ ర్యాంకులు వచ్చేవి. కానీ, జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌క్లాస్‌ స్టేట్‌ర్యాంకులు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను చూస్తే చాలా బాధ కలిగేది. సరైన యూనిఫాం ఉండేది కాదు, చిరిగిపోయిన బ్యాగ్‌లు, నలిగిపోయిన పుస్తకాలు, అరిగిపోయిన చెప్పులు, బెల్ట్‌లు ఉండేవి కాదు.. కానీ, ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో విద్యా కానుకతో పిల్లలకు మంచి పుస్తకాలు, నోట్‌బుక్స్, బ్యాగ్స్, బూట్లు, బెల్ట్, యూనిఫామ్స్‌ స్కూల్‌ తెరిచిన రోజే అందిస్తున్నారు. 

కేవలం పేద పిల్లల చదువుల కోసం నాలుగేళ్లలో అక్షరాల రూ.66 వేల కోట్లను ఖర్చు చేసిన ముఖ్యమంత్రిని రాష్ట్రంలో ఎప్పుడైనా చూశారా.. ఈరోజు కురుపాం బహిరంగ సభ వేదికపై ఉన్నారు. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కోసం ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం ఇచ్చి కొన్ని వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. వేల కుటుంబాల తలరాతలు మార్చారు. విద్యా విప్లవం ద్వారా కొన్ని లక్షల పేదల కుటుంబాల తలరాతలు మార్చేందుకు అడుగులు వేస్తున్నారు. 

అమ్మ ప్రేమ ఎంత గొప్పదో.. అమ్మ ఒడి పథకం అంత గొప్పది. ఇలాంటి అమ్మ ఒడి పథకాన్ని చంద్రబాబు అబద్ధం అంటున్నారు. ఈ వేదిక మీద నుంచి చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నా.. మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా పేద పిల్లల చదువుల కోసం ఇలాంటి పథకం అమలు చేయాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా..? అమ్మ ఒడి అబద్ధం కాదు.. అమ్మ ఒడి అక్షయపాత్ర. పేద పిల్లలతో అక్షరాలు దిద్దించే అక్షయపాత్ర. ఓవైపు అమ్మ ఒడి పథకం అబద్ధం అంటూనే సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న పథకాన్ని కాపీ కొట్టిన ఘనత చంద్రబాబుది. 

సీఎం వైయస్‌ జగన్‌ హామీలను చంద్రబాబు కాపీ కొట్టగలడేమో.. మా జగనన్న మ్యానిఫెస్టోను, ఆలోచనలు కాపీ కొట్టగలడేమో.. మా జగనన్న మంచి మనసును కాపీ కొట్టలేరు. మా జగనన్న క్రెడిబులిటీ, కమిట్‌మెంట్‌ను, పేదలకు మేలు చేసే మా జగనన్న డెడికేషన్‌ను ఎప్పటికీ కాపీ కొట్టలేరు. మీ పులిహోర హామీలు, దద్దోజనం ఆలోచనలకు ఈసారి జనం దగ్గర పప్పులుడకవు చంద్రబాబూ.. నీ అబద్ధాలను నమ్మడానికి, నీ హామీలతో మోసపోవడానికి ఇదేమీ 2014 కాదు.. 2024. వచ్చే ఎన్నికల్లో సీఎం వైయస్‌ జగన్‌ కొట్టే సీట్లలో ఒక్కసీటు తగ్గదు.. జగనన్న కూర్చునే సీఎం సీటు ఇంచు కూడా కదలదు. 

పార్టీ గుర్తు లేనోళ్లు, ప్రజల్లో గుర్తింపు లేనోళ్లు, ప్రజలు గుర్తుపెట్టుకునేలా పాలించలేనివాళ్లు ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చినా.. జనం గుండెల్లో గూడు కట్టుకునన జగనన్నను ఓడించడం కాదు కదా.. కనీసం జగనన్న నీడను కూడా తాకలేరు. ఎల్లో మీడియాను చూసుకొని, దుష్టచతుష్టయంను చూసుకొని ఒంటరిగా వచ్చే జగనన్నను ఓడించాలని కలలు కంటున్నారేమో.. జగనన్న ఒక్కడు కాదు.. ఆరు కోట్ల మంది ఆంధ్రుల్లో ఒకే ఒక్కడు. 

జగనన్నను తాకలంటే ఆయన కోసం ప్రాణాలిచ్చే మాలాంటి కార్యకర్తలను దాటాలి.. మా రాజన్న భక్తులను దాటాలి.. మా సోషల్‌ మీడియా సైన్యాన్ని దాటాలి.. కోట్లాది మంది పేద గుండెలను దాటాలని గుర్తుపెట్టుకోండి. రామాయణంలో రాముడిని గుండెల్లో పెట్టుకున్న హనుమంతుడు ఒక్కడే ఉన్నాడు.. కానీ, ఈ రాష్ట్రంలో జగనన్నను గుండెల్లో పెట్టుకున్న హనుమంతుడి లాంటి కార్యకర్తలు కోట్లలో ఉన్నారు. అందుకే చంద్రబాబు పొత్తులు, ఎత్తులు, జిత్తులు అన్నీ కూడా జగనన్న ప్రజాబలం ముందు చిత్తు చిత్తు కావడం ఖాయం. 

కురుపాం గడ్డ వైయస్‌ఆర్‌ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. నాడు వైయస్‌ఆర్‌ మా ప్రాంత అభివృద్ధి కోసం ఒక్క అడుగు ముందుకేస్తే.. ఈరోజు మా ప్రాంత అభివృద్ధి కోసం జగనన్న వంద అడుగులు ముందుకేశారు. అడగగానే మాకు మన్యం జిల్లాలను, అడగకుండానే ఇంజినీరింగ్‌ కాలేజీని ఇచ్చారు. మా అవసరాలను గుర్తించి రూ.1200 కోట్ల అభివృద్ధి పనులను ఇచ్చారు. మా ప్రజల ఆకలి తీర్చేందుకు, ఆయుష్షు పెంచేందుకు, ఆత్మగౌరవం పెంచేందుకు రూ.1000 కోట్ల సంక్షేమాన్ని అందించారు. ఏ నమ్మకంతో అయితే మీకు ఓట్లు వేశారో.. ఆ నమ్మకం నిజం చేసేలా నాలుగేళ్ల పాలనలో నిజం చేసి చూపించారు. 

ఆనాడు ప్రతి గుడిసెలోనూ వైయస్‌ఆర్‌ను పెట్టుకొని కొలిచారు. ఈరోజు ప్రతి గుండెలోనూ జగనన్నను పెట్టి కొలుస్తున్నారు. మా కోసం, మా ప్రజల కోసం. మా ప్రాంతం కోసం ఇంత మేలు చేసిన మీకు ఎప్పుడూ ఈ ప్రజలు అండగా ఉంటారని గర్వంగా తెలియజేస్తున్నాను. 

కురుపాంకు సంబంధించి

  • కురుపాం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన గుమ్మడిగడ్డ మినీ రిజర్వాయర్‌ 38.9 కోట్ల రూపాయల సింగపురం గ్రామంలో మంజూరు చేయాలని కోరుతున్నాం. సుమారు 5–6 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు. 
  • తోటపెల్లి–గునుపూర్‌ మధ్య ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న వంతెనకు ప్రత్యామ్నాయంగా కొత్త వంతెన రూ.12 కోట్లు వెచ్చించి నిర్మించాల్సి ఉంది. దాన్ని మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. 
  • కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలంలోని పది గ్రామాలకు జంజావతి ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణాల్లో ఒకటైన 21ఎల్‌ డిస్ట్రిబ్యూటరీ ద్వారా ఆయకట్టు చివరి భూములకు సుమారు 6 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో కొత్తగా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ నిర్మాణంలో గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామంలో జంజావతి ప్రాజెక్టు లోలెవల్‌ కెనాల్‌ నుంచి నీటిని లిఫ్ట్‌ చేయడానికి సుమారు 5 కోట్ల రూపాయలతో అంచనాలను రూపొందించాం. దాన్ని మంజూరు చేయాలి. 
  • పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో సుమారు 66 వేల ఎకరాల్లో జీడిమామిడి తోట సాగు చేస్తున్నారు. అందులో 50 వేల పైచిలుకు ఎకరాల్లో జీడిమామిడి తోట కురుపాంలోనే ఉంది. ఐటీడీఏ పరిధిలోని ట్రైబల్‌ ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ ద్వారా జీఎల్‌పూర్‌ మండల కేంద్రంగా క్యాస్యూనట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను మంజూరు చేయాలి. 

 

Back to Top