రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

ఎమ్మెల్యే పార్థసారధి
 

విజయవాడ: వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పార్థసారధి పేర్కొన్నారు. సోమవారం ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పార్థసారధి పర్యటించారు. యలమలకుదురు డంపింగ్‌ యార్డును ఎమ్మెల్యే పరిశీలించారు. పెదపులిపాక వరకు రిటర్నింగ్‌ వాట్‌ ఏర్పాటు చేస్తామని పార్థసారధి తెలిపారు. వరద ప్రవాహం తగ్గడంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని పార్థసారధి తెలిపారు.

Back to Top