వైయస్‌ఆర్‌సీపీది రైతు ప్రభుత్వం

రైతు సమస్యలను పరిష్కరించింది వైయస్‌ఆర్‌, వైయస్‌ జగనే

వైయస్‌ఆర్‌లా రైతులకు మేలు జరిగేలా వైయస్‌ జగన్‌ ఆలోచిస్తున్నారు

చంద్రబాబు ఏనాడు రైతుల సమస్యలను పట్టించుకోలేదు

అకాల వర్షాలతో దిగుబడి తగ్గడంతో ఉల్లిధరలు పెరిగాయి

టీడీపీ నేతలు శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు

రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని సీఎం ఏర్పాటు చేశారు

నేడు దళారులు రైతుల పొట్ట కొట్టే పరిస్థితి లేదు

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వస్తోంది

ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అమలు చేస్తున్నాం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి

అసెంబ్లీ:  వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఎమ్మెల్యే పార్థసారధి పేర్కొన్నారు. రైతులకు మేలు చేసింది ఆ నాడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, ఈ రోజు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే అన్నారు. చంద్రబాబు ఏ నాడు రైతుల గురించి ఆలోచించలేదన్నారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో పార్థసారధి మాట్లాడారు. 
ఉల్లిపాయల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు ముఖ్యమైన కారణం అకాల వర్షాలు. ఉల్లిపాయలు మహారాష్ట్రలో అధికంగా పండిస్తారు.  పంట చేతికందే సమయానికి అధిక వర్షాలతో దెబ్బతినింది. దీంతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఉల్లి కొరత ఏర్పడింది. ఇతర దేశాల నుంచి ఉల్లి దిగుమతి చేయాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో ఉల్లి సమస్యను గుర్తించి సీఎం వైయస్‌ జగన్‌ అగ్రిమిషన్‌ ద్వారా మూడుసార్లు సమీక్షలు చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే రైతు బజార్ల ద్వారా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వమే నేరుగా టెండర్లలో పాల్గొని ప్రతి రోజు కూడా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వినియోగదారులకు పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు 38 వేల క్వింటెన్లు కొనుగోలు చేసి ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.25 లకే కిలో ఉల్లి సరఫరా చేస్తున్నాం. హైదరాబాద్‌లో ఒకే ఒక రైతు బజార్‌లో సరఫరా చేస్తున్నారు. ఢిల్లీలో కొన్నాళ్లు చేసి ఆపేశారు. పక్కరాష్ట్రంలో రూ.45 చొప్పున విక్రయిస్తున్నారు. మన ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో 101 రైతు బజార్లలో సరఫరా చేస్తోంది. ఇదంతా సీఎం వైయస్‌ జగన్‌ ఘనత అని చెప్పవచ్చు. ధరలు తగ్గేవరకు రూ.25లకే ఇస్తామని సీఎం చెప్పారు. దాదాపు రూ.75 కోట్లు ఇప్పటికే నిధులు విడుదల చేశారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం. టీడీపీ నేతలు శవరాజకీయాలు చేస్తున్నారు. ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోతే దాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. సాంబిరెడ్డి అనే రైతు చనిపోయి కుటుంబ సభ్యులు బాధతో ఉంటే ..టీడీపీ నేతలు వెళ్లి ఉల్లి కోసం వెళ్లి చనిపోయారని ఒత్తిడి చేశారు. ప్రతిపక్షం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయాల్సింది పోయి శవ రాజకీయాలు చేస్తోంది. వినియోగదారులకు అతి తక్కువ ధరలకు ఉల్లిపాయలు అందజేస్తోంది. ఇది రైతు ప్రభుత్వం. రైతులకు అన్ని విధాల అండగా ఉంది. రైతు గురించి అందరూ ఉపన్యాసాలు చేశారు కానీ, వారి సమస్యలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రులు అరుదుగా ఉంటారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిలు ఉన్నత కుటుంబంలో పుట్టినా కూడా రైతుల సమస్యలపై ఆలోచన చేశారు. వాటి పరిష్కారానికి కృషి చేశారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చేసరికి వరి ధర రూ.530 ఉంటే..దాన్ని వైయస్‌ఆర్‌ రూ. 1030 పెంచారు. రైతుకు ఏ విధంగా అండగా ఉండాలో వీరిద్దరి నుంచి నేర్చుకోవాలి. చంద్రబాబు కూడా ఓ సన్నకారు కుటుంబం నుంచి వచ్చారని విన్నాను. అయితే ఆయన ఆలోచన అంతా కూడా దావోస్‌, సింగపూర్‌, సాప్ట్‌వేర్‌ పదాలతో రాజకీయాలు పెంపొందించుకోవాలని ఆలోచన చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా రైతులకు నష్టాలే మిగిలాయి. చంద్రబాబు రాజకీయాల్లో చక్రం తిప్పిన రోజుల్లో కూడా మనం చూస్తే రాష్ట్రంలో అత్యధికంగా పండించే పంట వరి. దానికి చంద్రబాబు హయాంలో రూ.160 పెంచారు. వైయస్‌ఆర్‌ ఐదేళ్లలో దాదాపు రూ.500 పెంచారు. ఈ రోజు అదే దారిలో వైయస్‌ జగన్‌ కూడా రైతులకు, వినియోగదారులకు మేలు చేసేలా పరిపాలన చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ 2014 ఎన్నికల్లో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దాన్ని కాపీ కొట్టిన చంద్రబాబు రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు.  అఖరి బడ్జెట్‌లో రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారు. దాంట్లో రూ.25 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా రూ.475 కోట్లు ఎన్నికల కానుకలకు చంద్రబాబు ఖర్చు చేశారు. ఈ ప్రభుత్వం అదే ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. రైతుకు న్యాయం జరగాలని చెప్పి..హై లెవెల్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు రైతుల పరిస్థితులను బేరీజు వేసుకుంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఎమ్మెల్యేను మార్కెట్‌యార్డ్‌ గౌరవ చైర్మన్లుగా ఈ ప్రభుత్వం నియమించింది. ప్రతి నెల మార్కెట్‌ యార్డుకు వెళ్లి పంటల ధరలపై నేరుగా రైతులతో తెలుసుకుని ఒక నివేదిక పంపించే వ్యవస్థను ఈ రోజు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో మిర్చి పంట అత్యధికంగా పండుతోంది. గత ప్రభుత్వంలో అనగా 2014-15లో మిర్చి క్వింటాల్‌ రూ.7564 ఉంటే ఆ ప్రభుత్వం దిగే సమయానికి రూ.2 వేల నుంచి రూ.3 వేలకు మిర్చి ధర పడిపోయింది. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేసింది. కనీసం రూ.1000 ఇవ్వాలనే ప్రయత్నం చేయలేదు. పెట్టుబడి కంటే 50 శాతం లాభం వచ్చేలా స్వామినాథన్‌ కమిషన్‌ సిపార్సులు పాటిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారు. మిర్చియార్డుకు వెళ్తే 4 నుంచి 5 శాతం దళారులు కమీషన్‌ తీసుకునేవారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో మిర్చికి రూ.18000 ధర ఉంది. రైతు రూ.900 కమీషన్‌ కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఈ రోజు రైతు మార్కెట్‌ యార్డుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా..కోల్డ్‌ స్టోరేజీల్లోనే అమ్ముకునే అవకాశం కల్పించాం. వరి ధాన్యానికి ఇప్పటివరకు దాదాపు 1800 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. గతంలో దళారులు తేమ శాతం అధికంగా ఉందని ధరలు కోత విధించేవారు. గత ప్రభుత్వం వందల పేజీలతో మేనిఫెస్టో పెట్టారు. రుణమాఫీ రూ.25 కోట్లకు కుధించారు. దాంట్లో కూడా రూ.10 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. రైతులకు ఎగనామం పెట్టిన ప్రభుత్వం గతంలో చూశాం. ఈ ప్రభుత్వం రైతుల పరిస్థితిని చూసి మొట్ట మొదటి సంవత్సరం నుంచే రైతు భరోసా కింద రూ. 63,500 చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానిక తేడా ఏంటంటే..గతంలో ముఖ స్తుతి కోసం చేస్తే..ఈ ప్రభుత్వం అర్హులందరికీ న్యాయం జరిగేలా చూడటం. ప్రతి రైతుకు కూడా రైతు భరోసా అందేలా చర్యలు తీసుకుంది. సీఎం వైయస్‌ జగన్‌ మొదటి రోజు స్పష్టం చెప్పారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే నమోదుకు గడువు పెంచారు. ఏ  ఒక్కరూ కూడా రైతు భరోసా అందడం లేదని చెప్పడం లేదు. డాక్యుమెంట్‌లో తప్పులుంటే సరి చేస్తున్నాం. ఈ ఆరు నెలల్లోనే ధరల స్థిరీకరణ నిధి ఏవిధంగా ఉపయోగపడిందో చూస్తే..బెంగాల్‌ గ్రామ్‌కు జీవో 59 ఇచ్చి 5, జులైన ఇచ్చి ఒక్కోక్క రైతుకు రూ.45 వేలు ఇచ్చిన ఘనత వైయస్‌ జగన్‌కే దక్కుతుంది. దాదాపు 27 వేల మంది రైతులకు ధరల స్థిరీకరణ నిధి నుంచి రూ.100 కోట్లు ఉపయోగపడ్డాయి. ప్రతి రైతుకు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే. రైతులు దళారుల చేతుల్లో బలి పసువులు కాకూడదన్నదే ఈ ప్రభుత్వ ధ్యేయం. నేరుగా ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. పత్తికొండలో టమాట రైతుల నుంచి వ్యాపారులు మార్కెట్లో కొనుగోలు చేయం..బయటకు రావాలని ఒత్తిడి తెస్తే..ప్రభుత్వం అలాంటి వ్యాపారులపై చర్యలు తీసుకుంది. ప్రభుత్వమే మార్కెట్‌ యార్డుల ద్వారా టమాటలు కొనుగోలు చేసింది. అన్ని విధాల రైతులను మేలు చేస్తూ ఆదుకుంటుంది. రాబోయే రోజుల్లో కూడా రైతులకు మేలు చేసేది ఈ ప్రభుత్వమే. ఉల్లి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ప్రభుత్వమే సబ్సిడీలో అందజేస్తుంది. అన్ని రకాల పంటలను ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతుకు భరోసా ఇచ్చే ప్రభుత్వం ఇది.

Read Also: స‌న్న బియ్యం అనే ప‌దం మేనిఫెస్టోలో లేదు...

తాజా వీడియోలు

Back to Top