స‌న్న బియ్యం అనే ప‌దం మేనిఫెస్టోలో లేదు...

- అసెంబ్లీలో వైఎస్ జ‌గ‌న్‌

మేనిఫెస్టోలో ఉన్న ప్ర‌తి అంశాన్ని అధికారంలోకి వ‌చ్చాక అమ‌లు చేస్తామ‌ని చెప్పి ప్ర‌జ‌ల‌ను ఓట్ల‌డిగాం. ఈ మేనిఫెస్టోలో స‌న్న బియ్యం ప్ర‌స్తావ‌న ఎక్క‌డా లేదు. కానీ ప్రతిప‌క్ష స‌భ్యులు మాత్రం లేని అంశాన్ని మేము చెప్పామ‌న్న‌ట్టుగా ప్ర‌చారం చేస్తున్నారు. గతంలో చంద్ర‌బాబు పంపిణీ చేసిన బియ్యాన్ని ప్ర‌జ‌లు తిన‌లేక‌పోతున్నారు కాబ‌ట్టే మేమొచ్చాక నాణ్య‌మైన బియ్యం పంపిణీ చేస్తామ‌ని హామీ ఇచ్చాం. అందుకోసం శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టును మొద‌లుపెట్టాం. ఏప్రిల్ 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయ‌బోతున్నాం. దీనికోసం చంద్ర‌త‌బాబు క‌న్నా రూ. 1400 కోట్లు  అధికంగా ఖ‌ర్చుచేయ‌బోతున్నాం. ఈ బియ్యంలో డ్యామేజీ, నూక‌లు, త‌వుడు శాతాల‌ను భారీగా త‌గ్గించి క్వాలిటీ బియ్యం అంద‌జేస్తున్నాం. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ప్ర‌జ‌లు బియ్యం అమ్ముకోవాల‌న్న ఆలోచ‌న ప‌క్క‌న‌పెట్టి సంతోషంగా తింటున్నారు. స్వ‌ర్ణ వెరైటీ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. 
 

Read Also: చంద్రబాబు శవ రాజకీయాలు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top