కనిపించే దేవుడు మా జగనన్న

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా
 

 

గుంటూరు: ఏ ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రోగులను పరామర్శించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. చరిత్రలో లేని విధంగా మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి రోగుల బాధలను, డాక్టర్లు అందించే సేవలను అడిగి తెలుసుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స పొందిన తరువాత కొలుకునే సమయంలో ఆర్థిక సాయం అందించే ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని సీఎం ప్రారంభించారన్నారు. నిజంగా దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ, కనబడే దేవుడు మా జగన్‌ అని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. ఆస్పత్రిలోని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా.. ఏం కావాలమ్మా అని అడిగి మరీ తెలుసుకున్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా ఆరు నెలల పాలనలోనే సీఎం వైయస్‌ జగన్‌ 80 శాతం హామీలు నెరవేర్చారన్నారు. చిన్న పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు మన ప్రభుత్వం అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి ఆర్థికసాయం, విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు రూ. 5 వేలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 48 గంటల్లోనే రోగుల ఖాతాలో పడతాయి. అవినీతి రహిత పాలనతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కూడా వర్తింపజేస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన యువతి హైదరాబాద్‌లో యాక్సిడెంట్‌కు గురైతే విషయం తెలిసిన వెంటనే స్పందించి ఆ యువతికి ఆపరేషన్‌ చేయించారన్నారు.

Read Also: మహానేతకు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

తాజా ఫోటోలు

Back to Top