తాడేపల్లి: ఎస్సీ, ఎస్టీల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవద్దా అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రశ్నించారు. పేదల అభ్యున్నతి కోసం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద పిల్లలు ఇంగ్లీష్ విద్య చదువుకోవడానికి వీలు లేదా అని, ఈ విషయాన్ని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు ఇంగ్లీష్ చదువులు చదువుకోవద్దని బహిరంగంగా చెబుతారా అన్నారు. ఆంధ్రజ్యోతి అధినేత ఏ స్టేజీ నుంచి ఏ స్టేజీకి ఎదిగారో..ఎవరికి బినామీగా ఉన్నారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఆయన రాతలు దారుణంగా ఉన్నారన్నారు. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకునేందుకు వైయస్ జగన్ అవకాశం కల్పించారని, చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు డైరెక్షన్లో పని చేస్తున్నారని, అసలు ఆయన జ్ఞానినో, అజ్ఞానినో తేల్చుకోవాలన్నారు. ఫెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు డ్రామాలాడిస్తున్నారని, అవాక్కులు, చవాక్కులు మానుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Read Also: తెలుగు రాష్ట్రాల విభజనకు కారకులెవరు?