అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు. జగనన్న రైతు పక్షాన, బాబు రాబంధుల పక్షాన.. జగనన్న పేదల పక్షాన, బాబు పెద్దల పక్షాన... జగనన్న స్టేట్ డెవలప్‌మెంట్ పక్షాన, బాబు రియల్ ఎస్టేట్.. జగనన్న అందరి పక్షాన, బాబు అమరావతి పక్షాన.. పోలిక పోల్చుకోవడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను పక్కరాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటాయని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడారు సొంత తాత ఖర్జూరనాయుడు పేరు చెప్పుకోకుండా.. మరో తాత గురించి ఎప్పుకుంటూ లోకేష్ తొడలు కొడుతూ తిరుగుతున్నాడని, శ్రీకాళహస్తిలో పాదయాత్ర చేస్తూ ఒక కంపెనీ అయినా మీరు తెచ్చారా మాట్లాడుతున్నాడన్నారు. వైయస్ జగన్ సీఎం అయిన తరువాత టీసీఎల్ కంపెనీ వచ్చింది. 10 వేల మందికి ఉపాధి లభించింది. టీసీఎల్ శ్రీకాళహస్తిలోనే ఉంది. నిశ్చితార్థం అయిపోతే పెళ్లి అయిపోనట్టు కాదు.. పేర్లు చెప్పి మా కంపెనీలు అంటే కుదురదు. సీఎం వైయస్ జగన్ ఆ పరిశ్రమకు భూమి కేటాయించారు, కంపెనీని ప్రారంభించారని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు.