ఏపీ సోషల్‌ రిఫార్మర్‌ సీఎం వైయస్‌ జగన్‌

సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వమే ఆంధ్రప్రదేశ్‌ బలం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి

తాడేపల్లి: కరోనా విపత్తులోనూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, నేడు ఎంఎస్‌ఎంఈలకు రీస్టార్ట్‌ ప్యాకేజీ ద్వారా రెండవ విడత రాయితీ బకాయిలు చెల్లించి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు జీవం పోశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. తొలి ఏడాది పాలనలోనే రూ.41 వేల కోట్లతో 4 కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు దక్కుతుందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వమే ఆంధ్రప్రదేశ్‌ బలమన్నారు.

పాదయాత్రలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు..
తన సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన లక్ష్యాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయించుకున్నారన్నారు. నవరత్నాల ద్వారా ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందించి ఏపీ సోషల్‌ రిఫార్మర్‌ సీఎం వైయస్‌ జగన్‌ అని గుర్తుకువచ్చే విధంగా తొలి ఏడాది పాలన సాగిందన్నారు. సంక్షేమ పథకాలే కాకుండా.. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ కృషిచేస్తున్నారన్నారు. కరోనా కష్టకాలం కూడా ‘వైయస్‌ఆర్‌ రైతు భరోసా, వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక, వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ, వైయస్‌ఆర్‌ వాహన మిత్ర, వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా, వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం, వైయస్‌ఆర్‌ కాపు నేస్తం, వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, వైయస్‌ఆర్‌ కంటి వెలుగు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన’ పథకాలు అమలు చేశారన్నారు. అదే విధంగా ఈ రోజున రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద ఎంఎస్‌ఎంఈలకు రూ.512 కోట్లు విడుదల చేశారన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న సుమారు 97,428 ఎంఎస్‌ఎంఈలను రీస్టార్ట్‌ ప్యాకేజీ ద్వారా ఆదుకున్నారని, అంతేకాకుండా మూడు నెలల విద్యుత్‌ ఫిక్డ్స్‌ చార్జీలను కూడా మాఫీ చేశారన్నారు.

చంద్రబాబువి నీచ రాజకీయాలు
గత ప్రభుత్వం పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌ల పేరిట బోగస్‌ ఎంఓయూలతో ప్రజల సొమ్మును దుబారా చేసిందన్నారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేశారని, 2019 ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా.. చంద్రబాబు ఇప్పటికీ నీచ రాజకీయాలు మానుకోలేదన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top