దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేది చంద్రబాబే

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి

విజయవాడ: దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, టీడీపీ హయాంలో చంద్రబాబు కూల్చేసిన ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. ఎమ్మెల్యే పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అండదండలతోనే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ప్రజలందరికీ తెలుసన్నారు. ఆలయాలపై దాడి చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఆలయాలను ధ్వంసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని పునర్నిర్మాణం చేయడానికి ప్రభుత్వం భూమిపూజ చేసిందన్నారు.

మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నాడని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం ఇంత బ్రహ్మాండంగా పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిందిస్తే.. ప్రజలు తరిమికొడతారనే భయంతో.. కుట్రపూరిత ఆలోచనతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని ఫైరయ్యారు. మతసామరస్యం కాపాడేందుకు సీఎం ప్రత్యేక శ్రద్ధ పెట్టారని గుర్తుచేశారు. 
 

Back to Top