వైయ‌స్ఆర్‌సీపీరాష్ట్ర మహిళా విభాగానికి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర మహిళా విభాగానికి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు.
జోన్-1 ఆరు జిల్లాలు (శ్రీకాకుళం, విజయన గరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి)కు అనకాపల్లికి చెందిన ఇ. అనురాధ ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు.
జోన్-2 ఐదు జిల్లాలు(కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు)కు కాకినాడ జిల్లాకు చెందిన వంగా గీతను నియమించారు.
జోన్-3 ఐదు జిల్లాలు(కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల)కు కృష్ణా జిల్లాకు చెందిన ఉప్పాల హారికను నియమించారు.
జోన్-4 ఐదు జిల్లాలు(ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి)కు నెల్లూరు జిల్లాకు చెందిన కాకాని పూజితను నియమించారు.
జోన్-5 ఐదు జిల్లాలు(వైయ‌స్ఆర్‌, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి)కు కర్నూలు జిల్లాకు చెందిన ఎస్వీ విజయ మనోహరిని నియమించారు. 

Back to Top