అందరూ సీఎం వైయస్‌ జగన్‌ను మెచ్చుకుంటుంటే..ఇదేం పని బాబూ?

చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కరుణం ధర్మశ్రీ

విశాఖ: మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కరుణం ధర్మశ్రీ పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించడం పట్ల దేశవ్యాప్తంగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తుంటే..ప్రతిపక్షనేత చంద్రబాబు జీర్ణించుకోలేక అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చంద్రబాబు గాంధీ జయంతి రోజు మద్యం అమ్మకాలు అంటూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్ర మేధావులతో కలిసి కరుణం ధర్మశ్రీ మాట్లాడారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసుకొని ఏపీలో దేశంలోనే ఒక చారిత్రత్మక ఘట్టంగా ముందుకు వెళ్తుంటే ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందన్నారు. ప్రజలంతా కూడా సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చిన సంస్కరణలు అన్నీ కూడా మెచ్చుకుంటుంటే..ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆదరణ, అభిమానం, ఆప్యాయత సీఎం వైయస్‌ జగన్‌కు దక్కకూడదని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. గాంధీ జయంతి రోజున పోలీసులు దగ్గరుండి మద్యాన్ని అమ్మిస్తున్నారని చంద్రబాబు పేర్కొనడం సిగ్గుచేటు అన్నారు. ఎల్లోమీడియాలో గాంధీ జయంతి రోజు బ్రాందీ అమ్ముతున్నారని విష ప్రచారానికి తెర లేపిందన్నారు. మహాత్ముడి పుట్టిన రోజున మద్యం షాపులు నడుపుతారా అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నట్లు ఎల్లోమీడియాలో కథనాలు రాశారన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న మేధావుల సమక్షంలో చంద్రబాబును ప్రశ్నిస్తున్నామన్నారు. చంద్రబాబు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. బాపూజీ కన్న కలలు నెరవేర్చేందుకు వైయస్‌ జగన్‌ గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చంద్రబాబు విష ప్రచారానికి తెర లేపారని విమర్శించారు. ఇకనైన చంద్రబాబు ఇలాంటి చీఫ్‌ పాలిట్రిక్స్‌ మానుకోవాలని హితవు పలికారు. లేదంటే ఇప్పుడున్న 23 సీట్లు కూడా భవిష్యత్తులో రావని, ప్రజలే చంద్రబాబుకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

Back to Top