ప్రజలకు మంచి చేయాలన్నదే వైయస్‌ జగన్‌ తపన

పవన్‌ రాజకీయాలను కూడా సినిమాలాగా చూస్తున్నారు  

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ 

విశాఖ: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్‌ అయ్యారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు మేలు చేయాలని తపనతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వంద రోజుల పాలనలోనే గత ప్రభుత్వాలు చేయని చారిత్రాత్మక చట్టాలు చేశారని తెలిపారు. గతంలో ఇసుక మాఫియాపై ప్రశ్నించని పవన్‌ ..మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయాలను కూడా సినిమాలాగా చూసుకుంటున్నారని విమర్శించారు. గాజువాకలో తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఒక్కసారి కూడా రాలేదని తప్పుపట్టారు. 

Back to Top