నిమ్మగడ్డ తాపత్రయమంతా చంద్రబాబు మెప్పు కోసమే..

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వైయస్‌ఆర్‌ సీపీదే విజయం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ: చంద్రబాబు మెప్పు కోసం మాత్రమే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పనిచేస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ పనిచేస్తున్నారన్నారు. విశాఖలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలు వద్దని ప్రభుత్వం కోరుతున్నా.. నిమ్మగడ్డ వినిపించుకోవడం లేదని, ప్రజారోగ్యాన్ని కూడా నిమ్మగడ్డ లెక్క‌చేయ‌డం లేద‌ని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా.. వైయస్‌ఆర్‌ సీపీ అద్బుతమైన విజయాన్ని సాధిస్తుందన్నారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలు వద్దని మాత్రమే కోరుతున్నామన్నారు. 

Back to Top