నీ కొడుకు, మ‌న‌వ‌డిని నారావారిపల్లెలో చదివించావా?

పిల్ల‌ల చ‌దువుల గురించి మాట్లాడే నైతిక హ‌క్కు చంద్ర‌బాబుకు లేదు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చంద్రబాబు ఎందుకు భయపడిపోతున్నాడు

ఎన్ని కుట్రలు చేసినా తన గ్రాఫ్ పెరగడంలేదన్న ఫ్రస్ట్రేషన్ లో బాబు 

సొంత జిల్లా చిత్తూరుకు కూడా ఏమీ చేయలేని బాబు.. పెద్దిరెడ్డిపై విమర్శలా..?

టీడీపీ హయాంలో అవినీతి, లంచగొండితనాన్ని చంద్రబాబు పెంచిపోషించాడు

ఉచిత విద్యుత్, రైతుల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు

మూడేళ్ల‌లో 95శాతం హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌దే

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి

తాడేప‌ల్లి: రాజకీయాల‌ విలువలను అథఃపాతాళానికి నెట్టేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువులను దిగజార్చి, అధికారంలో ఉన్న‌న్నాళ్లూ కేవలం వ్యక్తిగత, కుల రాజకీయాలు, వ్యవస్థ నిర్వీర్యం, అవినీతి, లంచగొండి తనాన్ని పెంచి పోషించాడ‌ని, వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వ‌జ‌మెత్తారు. వీటన్నింటి పర్యావసానంగా 2019 ఎన్నికల్లో దారుణమైన ఓటమిని పొందడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు తాను నిర్మించిన వ్యవస్థలతో ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో నిత్యం కుట్రలు పన్నుతున్నాడ‌ని మండిప‌డ్డారు. ప్రభుత్వం మంచి చేస్తున్నా, దాన్ని చెడుగా ప్రచారం చేసే నీచస్థాయికి దిగజారాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం ఎంత బుర‌ద‌జ‌ల్లినా తన గ్రాఫ్‌ అణువంతకూడా పెరగడం లేదనే ఆందోళనతో బాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.  

గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..

కరోనా వంటి విపత్తు కాలంలో కూడా,  ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ప్రజలకు కనీసం భరోసా ఇవ్వకుండా, హైదరాబాద్‌లో రూ.300కోట్లతో నిర్మించుకున్న తన కోట నుంచి అడుగు బయట పెట్టకుండా, నెలలు తరబడి అక్కడే ఉన్న వ్యక్తి చంద్రబాబు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోకపోగా, హైదరాబాద్ లో దాక్కున్న వ్యక్తి చంద్రబాబు, ఇప్పుడు మహానాడు, మినీ మహానాడులు అంటూ ఊర్లు పట్టుకుని తిరుగుతూ.. కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితం అయ్యాడు. చంద్రబాబు మాట్లాడే మాటల్లో.. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రజలకు ఫలానా మంచి చేశాను అని ఎక్కడా చెప్పలేడు. పోనీ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాడో, ఏ విధంగా ప్రజలను ఆదుకుంటాడో కూడా చెప్పడం చేతకాని వ్యక్తి చంద్రబాబు. కేవలం విమర్శలతో పాటు వ్యక్తిగత దూషణలకే పరిమితం కావడం సిగ్గుచేటు.

వైయ‌స్ జ‌గ‌న్‌ను ఎదుర్కోలేక బోరున ఏడ్చిన బాబు కన్నెర్ర చేస్తానంటూ ప్రగల్భాలు ప‌లుకుతున్నాడు. 
తన కొడకు వయసు ఉన్న సీఎం వైయ‌స్ జగన్‌ని రాజకీయంగా ఎదుర్కొలేక, ఏదీ చేతకాక, రాజకీయంగా సానుభూతి సంపాదించాలని 20 నిమిషాలు పాటు గగ్గోలు పెట్టి, బోరున ఏడ్చిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తాను కన్నెర్ర చేస్తే వైయస్సార్‌ సీపీ వాళ్లు బయటకు రాలేరని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు గట్టిగా అరిచి, కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడేవాళ్లేవరు లేరిక్కడ అని ముఖ్యమంత్రి గతంలో అసెంబ్లీలోనే చెప్పారు. ఎంతసేపటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. తనను ప్రజలు మర్చిపోతున్నారనే భయంతో, మీ పార్టీ ఉనికి కోసం, ముఖ్యమంత్రి మీద చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి పిల్లలు ఫారిన్‌లో చదివితే.. పేద పిల్లలను సరిగా చూసుకోవడం లేదని విమర్శలు చేస్తున్నాడు. మరి, మీ కొడుకు, మీ మనవడు ఎక్కడ చదివారు? నారావారిపల్లెలో చదివించావా? గవర్నమెంట్‌ స్కూల్‌లో చదవించావా?. గురివింద గింజలా.. ఆ మాటలు ఎందుకు..  అలాంటి విమర్శలు చేయడానికి మీకు అర్హత ఉందా..?

విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా విధానంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. మీ హయాంలో స్కూళ్లు, ఇప్పుడు స్కూళ్లు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే అర్థం అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెడుతుంటే, కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకువచ్చిన మీరు పేద పిల్లల గురించి మాట్లాడతావా? . మూడేళ్ళలో 95 శాతం హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి. 

సొంత జిల్లాకు కూడా ఏమీ చేయలేని బాబు
మినీ మహానాడు అంటూ మదనపల్లెలో మీటింగు పెట్టి ముఖ్యమంత్రి మీద, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనా చంద్రబాబు నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్నాడు బాబు. సొంత జిల్లాకు ఏమీ చేయలేని చంద్రబాబు తన స్వలాభం కోసం డెయిరీలను మూయించేశాడు. వైయ‌స్ జగన్‌ మంచి పనులు చేస్తున్నా చంద్రబాబు ద్వేషంతో ప్రజల మనసును డైవర్ట్‌ చేయాలని చూస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డికి జిల్లాలో ప్రజల ఆదరణ ఉంది కాబట్టే లక్షల మెజార్టీతో గెలవగలిగారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చంద్రబాబు ఎందుకు భయపడిపోతున్నాడు, ఉలిక్కిపడుతున్నాడు. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ గురించి ప్రజలను రెచ్చగొట్టేలా చంద్రబాబు నాయుడు మదనపల్లె సభలో మాట్లాడారు. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ విషయంలో మా ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామని చెప్పడమే కాకుండా, దాన్ని అమలు చేసి చూపించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. అయితే దీనిపై కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తూ బురద చల్లే కార్యక్రమం చేస్తున్నాడు. 

చంద్రబాబుకు ఇదే మా ఛాలెంజ్‌. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో చంద్రబాబు అధికారంలో ఉన్న 14ఏళ్లలో ఏమి అభివృద్ధి చేశారు. అదే మా మూడేళ్ల పాలనలో విద్యా, వైద్యం, రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలపై మేమెంత ఖర్చు పెట్టామనే దాని మీద లెక్కలు తీసుకు వస్తే చర్చకు సిద్ధంగా ఉన్నాం. 

రైతుల గురించి మాట్లాడే అర్హతే బాబుకు లేదు
రైతుల గురించి, ఉచిత విద్యుత్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకు ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మాహానేత వైయస్సార్‌ ఉచిత విద్యుత్‌ ఇస్తామంటే .. ఇక కరెంట్‌ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని ఆరోజు చంద్రబాబు మాట్లాడారు. ఉచిత విద్యుత్‌ను వైయస్సార్‌ అమలు చేసి, దేశంలోనే చిరస్థాయిగా రైతుల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి వైయస్సార్‌  తనయుడు జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ను ఎత్తేస్తున్నారంటూ విష ప్రచారం చేస్తున్నాడు. రాబోయే 30ఏళ్ల వరకూ రైతులకు ఉచిత విద్యుత్‌ అందాలని, మంచి ప్రణాళిక అమలు చేస్తే దానిపై కూడా ప్రజలను రెచ్చగొట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు.

- రాష్ట్రంలోని ప్రజలకు, రైతులకు, కర్షకులకు వైయస్సార్‌ కుటుంబం ఎప్పుడూ మేలు చేస్తుంది కానీ, ఎన్నడూ కీడు తలపెట్టదు. ఆ వర్గాలపై కుట్రలు చేసేది ఒక్క చంద్రబాబు నాయుడే. టీడీపీ మహనాడు అంతా కేవలం వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత ఇచ్చింది. 

ముఖ్యమంత్రి అభివృద్ధి ఓవైపు, సంక్షేమాన్ని మరోవైపు కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తుంటే చూసి ఓర్వలేక చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు. కుల, మత రాజకీయాలు చేసి, ప్రజలను రెచ్చగొట్టడమే చంద్రబాబు పని. అధికారంలో ఉండగా, ఆయన ఏ వ్యక్తికి మేలు చేసిన దాఖలాలు లేవు. మైనార్టీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేనే లేదు. తన మంత్రివర్గంలో మైనార్టీకిలకు స్థానం కల్పించన వ్యక్తి చంద్రబాబు. తమ హక్కులు కాపాడాలని పోరాడితే వారిపై రాజద్రోహం కేసులు పెట్టిచాడు. 

రాజకీయాలంటే సేవ అని బాబు గుర్తెరగాలి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ముఖ్యమంత్రి అన్ని వ్యవస్థలను సరిదిద్దుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు పెట్టిన బకాయిలను కూడా మా ప్రభుత్వం వచ్చాక తీర్చాం. మీ హయాంలో అవినీతి, లంచగొండితనంతో అన్నింటినీ లూటీ చేశారు. అదే మా ప్రభుత్వం సుమారు లక్షా 60 వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తే.. సీఎం ఆ డబ్బులను దోచుకున్నట్లు మాట్లాడటం దారుణం. మేం అధికారంలోకి వచ్చాక చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయావు. ఇప్పుడు ప్రజల్లో చులకన అయిపోతున్నావన్న భావనతో రోడ్డెక్కి,  ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఎంత రెచ్చగొట్టినా ప్రజలు చంద్రబాబును నమ్మరు. 

ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలు చేస్తున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారు. అధికారంలో ఉన్న 14ఏళ్లు ఏమీ చేయకపోగా... మళ్లీ తానేదో విజనరీ అన్నట్లుగా బిల్డప్‌ ఇచ్చుకుంటున్నాడు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. సిగ్గులేకుండా జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఇస్తే... జగన్‌ మోహన్‌ రెడ్డి మళ్లీ కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు ఎందుకు మంజూరు చేయాల్సి వచ్చేది? చంద్రబాబువి అన్నీ అసత్య ప్రచారాలే. దీన్నిబట్టే ఆయన విశ్వసనీయత ఏంటో అర్థం అవుతుంది. 

చంద్రబాబు మాట్లాడే ప్రతిమాట అసత్యమే. రాజకీయాలు అంటే కేవలం ఎన్నికలే కాదు.. ప్రజా సేవ కూడా అని చంద్రబాబు ఆలోచన చేయాలి. ఎంతసేపటికీ, ఎలా అధికారంలోకి రావాలి అన్న ఏకైక లక్ష్యంతో నీచ రాజకీయాలు చేసే..  మిమ్మల్ని తెలుగు ప్రజలెప్పుడూ అధికారంలోకి రానివ్వరనేది గుర్తు పెట్టుకుంటే మంచిది.

Back to Top