అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా..

వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి

వైయస్‌ఆర్‌సీపీ రాయచోటి అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా:మన రాష్ట్రం శ్రేయస్సు కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని రాయచోటి వైయస్‌ఆర్‌సీసీ అభ్యర్థి  గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఎన్ని నష్టాలు వచ్చినా,కేసులు పెట్టినా అనేక ప్రలోభాలు పెట్టిన ఏమాత్రం తలొగ్గని ప్రజలు వైయస్‌ఆర్‌సీపీని గెలిపిస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టులను పూర్తి చేసి  రెండు సంవత్సరాల్లో సాగునీరు ఇచ్చి ప్రతి చెరువు నింపడమే  ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కరువుతో విలవిలాడుతున్న మన ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ పార్టీని గెలిపించాలని కోరారు.

Back to Top