రీపోలింగ్‌ను స్వాగతిస్తున్నా..

ప్రజల ఓటు హక్కు కోసం న్యాయ పోరాటం

అప్రజాస్వామికంగా దళితుల ఓటు హక్కును అడ్డుకుంటున్నారు

సిసిపుటేజ్‌లు చూసి చర్యలు తీసుకోవాలి

ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోలేదు

వైయస్‌ఆర్‌సీపీ చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

తిరుపతి:ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోరారు.తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌ను స్వాగతిస్తానని తెలిపారు. దళితులు,గిరిజనులు,బీసీలను అప్రజాస్వామికంగా  ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌కు స్పష్టంగా ఫిర్యాదు చేసానని తెలిపారు.సిసిపుటేజ్‌లు చూసి చర్యలు తీసుకోవాలని కోరామ‌న్నారు. రిపోలింగ్‌ జరిగే ఐదు బూత్‌ల్లో 30 సంవత్సరాలుగా దళిత,గిరిజనులు ఓటు హక్కును వినియోగించుకోలేదన్నారు.ప్రజల  ఓటు హక్కు కోసం న్యాయ పోరాటం చేశామన్నారు. ఓటర్లను ఓటు వేయకుండా చేయడం చాలా బాధాకరమన్నారు.అధికారం అడ్డంపెట్టుకుని ఎమ్మార్వోను తొలగించారని తెలిపారు. కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను పెట్టి  ఓటింగ్‌ నిర్వహించారన్నారు.కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన‌ స్పందించలేదన్నారు.

ఏడు పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి ఫిర్యాదు చేస్తే.. ఐదు పోలింగ్‌ బూత్‌లకు ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌కు అనుమతించిందన్నారు.మిగా రెండు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ కోసం పోరాడతామని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. 13 తేదీ నుంచి సీసీ పుటేజ్‌ చూడాలని అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదన్నారు. కలెక్టర్,కేంద్ర,రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లకు సకాలంలో ఫిర్యాదు చేశామని తెలిపారు.టీడీపీ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.అబద్ధాలు మాట్లాడటంతో తెలుగుదేశం నేతలకు ఆస్కార్‌ అవార్డులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.పూటకో,రోజుకో అబద్ధం చెప్పే చంద్రబాబును టీడీపీ నేతలు,కార్యకర్తలు మించిపోయారన్నారు.  

Back to Top