తిరుపతి: చంద్రబాబు నాయుడు వారం రోజులు తిరుపతిలో మకాం వేసి ప్రచారం చేసినా టీడీపీకి ఓట్లు పడవని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరిగి వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గురుమూర్తికి ఓటు వేయాలని ఎమ్మెల్యే భూమన ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ ఒక్క రోజు ప్రచారానికి వస్తున్నారంటే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కుటుంబాలకు సీఎం వైయస్ జగన్ రాసిన లేఖ అందరిలోనూ ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. చంద్రబాబును ప్రజలెప్పుడో ఊడ్చి పారేశారన్నారు. చంద్రబాబు చేసేదేమీ లేక ఫ్రస్టేషన్‌తో ప్రజలను తిడుతున్నారన్నారు.