రూ. 75 వేల ఆర్థిక సాయంపై స్ప‌ష్ట‌త ఇచ్చాం

ఎమ్మెల్యే  భూమ‌న కరుణాక‌ర్‌రెడ్డి
 

అమ‌రావ‌తి:  ఇవాళ అసెంబ్లీ స‌మావేశాల్లో తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భ్యుల తీరు స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునేలా ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. చ‌ర్చ‌ల‌ను భ్ర‌ష్టు ప‌ట్టించేలా తెలుగుదేశం నేత‌ల ప్ర‌వ‌ర్త‌న ఉంది అంటూ ఆయ‌న అసెంబ్లీలో వారి వైఖ‌రిని ఖండించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారు స్ప‌ష్టంగా బిసిల‌కు, ఎస్సీల‌కు, ఎస్టీల‌కు 45ఏళ్లు నిండిన మ‌హిళ‌ల‌కు రూ.2000 ఇస్తామ‌ని చెప్పారు., దానిపై టీడీపీ గొడ‌వలు చేసాక‌, మ‌రోసారి ఈ ప‌థ‌కం గురించి చ‌ర్చించి 45 నిండిన ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీల‌కు రూ.75,000  ఆర్థిక సాయాన్ని చేయ‌బోతున్నాం అని స్ప‌ష్టంగా ప్ర‌క‌ట‌న చేసారు. ఆ మార్పును ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా టీడీపీ వారు అంత పూర్వ‌కు చెప్పిన‌ విష‌యాన్ని చూపుతూ స‌భ‌లో గొడ‌వ చేయ‌డం భావ్యంగా లేదు అన్నారు భూమ‌న‌. గ‌తంలో ఆయ‌న చెప్పిన మాట‌ను ప‌ట్టుకుని మేనిఫెస్టోలో పాద‌యాత్ర‌లో చెప్పిన‌దాన్ని విస్మ‌రించి కావాల‌నే మాట్లాడుతున్నారన్నారు.

మేనిఫెస్టోలో స్ప‌ష్టంగా నాలుగేళ్లకు రూ. 75000 ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించిన విష‌యాన్ని మీరెందుకు గ‌మ‌నించ‌లేదు అని ప్ర‌శ్నించారు క‌రుణాక‌ర్ రెడ్డి. రూ. 2000 పింఛ‌ను ప్ర‌క‌టించిన త‌ర్వాత తెలుగుదేశం నాయ‌కులు దాన్ని అబ్జెక్ట్ చేస్తే దాన్ని కూడా ప‌రిశీలించి నాలుగు సంవ‌త్స‌రాల్లో 75000 ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టిస్తున్నట్టుగా మార్పు చేసారు. దీన్ని మా మేనిఫెస్టోలో, మాకు భ‌గ‌వ‌ద్గీత లాంటి, ఖురాన్ లాంటి, బైబుల్ గా భావించేట‌టువంటి మేనిఫెస్టోలో కూడా ప్ర‌క‌టిస్తున్నామ‌ని స్ప‌ష్టంగా చెప్పారు. దాన్ని ప‌ట్టించుకోకుండా ఏదో విదంగా దాడి చేయాల‌ని చూస్తున్నారు. ప్ర‌తి స‌భ‌లోనూ, పాద‌యాత్ర‌లోనూ నాలుగేళ్ల‌లో 75000 ఆర్థిక సాయం అందించ‌బోతున్నాం అని చెప్పారు స్ప‌ష్టంగా జ‌గ‌న్ తెలియ‌జేస్తూ వ‌చ్చార‌ని అన్నారు. 

630 హామీలు ఇచ్చిన  టీడీపీ అందులో బోలెడు మార్పులు చేసారు. స్ప‌ష్టంగా చెప్పిన‌దాన్ని చేసి చూపుతున్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారు. జ‌గ‌న్ గారు చెప్పే మాట‌లు ప్ర‌జ‌ల‌కు చేర‌కుండా అడ్డుకుంటూ దాని ద్వారా ల‌బ్ది పొందాల‌నే కుయుక్తి మీది. 630 హామీల్లో మీరు ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేదు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాలి. ఉద్దేశ‌పూర్వ‌కంగా బుర‌ద చ‌ల్ల‌డ‌మ‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ మీరు చేసే ప‌నుల‌వ‌ల్ల ఆ బుర‌ద మీమీదే ప‌డుతుంది. తెలుగు జాతి అంతా మీ ప్ర‌వ‌ర్త‌న‌ను, స‌త్య‌దూర‌మైన మాట‌లు మాట్లాడ‌టాన్ని చూస్తోంది. మీకు ఇచ్చిన 23  మంది ని కూడా ఎందుకు ఎన్నుకున్నామా అని మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో మీ ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఇంత‌కంటే దారుణంగా టీడీపీ ఓడిపోతే బావుండేది అని ప్ర‌జ‌లు అనుకునే ప‌రిస్థితి వ‌స్తుంది. రూ.2000 పింఛ‌న్ హామీని టీడీపీ వాళ్లు ఎంత‌గానో ఎద్దేవా చేసారు. దాని త‌ర్వాత జ‌గన్ గారు ఈ విష‌యాన్ని ప‌రిశీలించి దాన్ని 75000 ఆర్థిక సాయంగా ప్ర‌క‌టించారు. ఆ విష‌యాన్ని ఎన్నో సార్లు వేదిక‌ల‌పై కూడా చెప్పారు. 
మీరు గొడ‌వ చేసి, స్పీక‌ర్ స్థానాన్ని అవ‌మాన ప‌రిచి, చ‌ర్చ జ‌ర‌గ‌కుండా అడ్డుకుని ల‌బ్ది పొందాల‌నుకుంటున్నార‌న్న విష‌యం ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్నారు భూమ‌న‌. 
 

తాజా ఫోటోలు

Back to Top