దోషులకు కఠిన శిక్ష తప్పదు

నూతన్‌నాయుడికి టీడీపీ నేతలతో సంబంధాలున్నాయ్‌

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌

విశాఖపట్నం: శిరోముండనం ఘటన దురదృష్టకరమని, దోషులకు కఠిన శిక్ష తప్పదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌ అన్నారు. విశాఖపట్నంలోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ ఫుటేజీ చూస్తే ఎంత అహంకారంతో ప్రవర్తించారో అర్థం అవుతుందన్నారు. ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారన్నారు. నూతన్‌నాయుడు భార్యతో పాటు ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారన్నారు. శిరోముండనం ఘటనపై టీడీపీ నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. నూతన్‌నాయుడితో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయి. నూతన్‌నాయుడు జనసేనకు సన్నిహితుడని చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో అరాచకాలకు అవకాశం లేదన్నారు. దళిత యువకుడికి అండగా ఉంటామని ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top