పార్టీని మళ్లీ మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేలా దృష్టి సారించాలి

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి పిలుపు

అనుబంధ విభాగాల అధ్య‌క్షుల‌తో రెండో రోజు కొన‌సాగిన స‌మావేశం

పార్టీ బ‌లోపేతంపై ప‌లు సూచ‌న‌లు, దిశానిర్దేశం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి మళ్లీ మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేలా దృష్టి సారించాల‌ని పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు వి.విజ‌య‌సాయిరెడ్డి పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో శ‌నివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు స‌మావేశాలు కొన‌సాగాయి. పార్టీ బ‌లోపేతంపై వారితో చ‌ర్చించి ప‌లు సూచ‌న‌లు చేశారు. వారికి దిశానిర్దేశం చేశారు.  పార్టీ కేడర్ లో అసంతృప్తులకు తావులేకుండా పార్టీని మరింత బలోపేతం చేసి మళ్లీ మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేలా దృష్టి సారించాల‌ని సూచించారు.  సీఎం వైయ‌స్‌ జగన్ విధానాలతో ప్రజలలో రోజు రోజుకు విశ్వాసం పెరుగుతోంద‌న్నారు.  ప్రతి ఎన్నికలోనూ ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీని గెలిపిస్తున్నార‌ని గుర్తు చేశారు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమైన పునాది. పార్టీ అనుబంధ సంఘాలు మరింత బలంగా పనిచేయాల‌ని, తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని.. దీన్ని తిప్పికొట్టాలని విజయసాయిరెడ్డి  పిలుపునిచ్చారు. స‌మావేశంలో పార్టీ అనుబంధ విభాగాల అధ్య‌క్షులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top