వైయస్‌ఆర్‌సీపీ ఓట్ల తొలగింపునకు టీడీపీ కుట్ర

సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసులు 

చర్యలు తీసుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తాం

వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఉమ్మారెడ్డి, పెద్దిరెడ్డి

అమరావతి: వైయస్‌ఆర్‌సీపీ ఓట్లను తొలగించేందుకు టీడీపీ కుట్ర చేస్తుందని ఎన్నికల సంఘానికి వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషనర్‌ గోపాలకృష్ణ ద్వివేదిని వైయస్‌ఆర్‌సీపీ నేతలు కలిశారు. చెవిరెడ్డి అక్రమ నిర్బంధం, ఓట్ల తొలగింపు, సర్వేలపై ౖÐð యస్‌ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.  రాష్ట్రంలోని దొంగ సర్వేలన్నీ ప్రభుత్వమే చేయిస్తోందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ట్యాబ్‌లతో ఓట్లు తొలగించేందుకు యత్నించారని, మా పార్టీ కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు అప్పగిస్తే మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు దారుణంగా అవమానించారని పేర్కొన్నారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. దొంగసర్వేలకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే చర్యలు తీసుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. 
 

Back to Top