విజయవాడ: మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడ సింగ్‌నగర్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అగంతకుడు రాయితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులు దిగ్ర్భాంతికి గురయ్యారు. దాడిని నిరసిస్తూ ఆయా ప్రాంతాల్లో పార్టీ నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేస్తున్నారు. దాడి చంద్రబాబు పనే : మంత్రి అంబటి దాడి ఘటనపై మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్‌పై దాడి చంద్రబాబు పనే అన్నారు. ఈ ఘటన బాబు ప్రోద్భలంతోనే జరిగింది. చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం సరికాదు. చంద్రబాబు, పవన్, బిజెపి ముగ్గురూ కలిసినా జగన్‌ను ఏమీ చేయలేరు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని అంబటి రాంబాబు అన్నారు. ప్రజాదరణను చూసి ఓర్వలేక ఇలా దాడులు : పేర్ని నాని సీఎం వైయస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఇలా దాడులు చేయడానికి తెగబడ్డారు. ఎంతమంది కలి వచ్చినా వైయస్ జగన్‌ను ఏమీ చేయలేక రాళ్ల దాడి చేశారు. సీఎం వైయస్ జగన్‌కు లోతుగా గాయమైంది. రెండు కుట్లు పడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. తల నుంచి రక్తం కారుతుంటే వైద్యులు ప్రధమ చికిత్స చేశారు. త్వరలోనే సీఎం వైయస్ జగన్‌పై ఎవరు దాడి చేయించారో అన్నీ బయటకు వస్తాయి అన్నారు. చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వైయస్ జగన్‌పై దాడికి చంద్రబాబు తప్పక మూల్యం చెల్లించుకుంటారు. చంద్రబాబు ఒక ముఖ్యమంత్రిపై ఇలా దాడి చేయించడం సరికాదు. ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నారు. ప్రజలు బుద్ధి చెబుతారు. మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నా. సీఎంపై టీడీపీ గూండాలు దాడి చేయడం అమానుషం. ఇలాంటి దాడులు చేయడమే టీడీపీ పాలసీ. ఎన్నికల్లో ఓటమి తప్పదని టీడీపీ నేతలు ఇలా దాడులకు తెగబడుతున్నారు అని విక్రమ్‌రెడ్డి అన్నారు.