అమిత్‌ షా అపాయింట్‌ మెంట్‌ కోసమే బాబు డ్రామాలు

అనంత‌పురం జ‌నాగ్ర‌హ దీక్ష‌లో ఎమ్మెల్యే అనంత వెంక‌ట‌రామిరెడ్డి 

అనంతపురం: టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష కొనసాగుతోంది. ఈ సంద‌ర్భంగా అనంత వెంక‌ట‌రామిరెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో గొడవలు సృష్టించాలన్నాదే బాబు లక్ష్యమని అన్నారు. చంద్రబాబుకు అధికారం లేకపోతే నిద్రపట్టదని విమర్శించారు. అందుకే.. గతంలో అయ్యన్నపాత్రుడుతో దుర్భాషలాడించారు. అప్పుడు వారి ప్లాన్‌ ఫలించలేదని అన్నారు. అందుకే మళ్లి ఇప్పుడు పట్టాభితో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించారన్నారు. కేంద్రమంత్రి అమిత్‌ షాతో.. చం‍ద్రబాబు ఫోన్‌లో మాట్లాడితే వీడియోలు రిలీజ్‌ చేసి హడావిడి చేసేవారని అన్నారు. కేవలం అమిత్‌ షా అపాయింట్‌ మెంట్‌ కోసమే బాబు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో అమిత్‌షాపై టీడీపీ నేతలు రాళ్లేయించారని అన్నారు. చంద్రబాబు ప్రతిసారి దిగజారీ రాజకీయాలు చేస్తుంటారని అన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక భాష.. లేకపోతే మరో భాష మాట్లాడతారని ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top