సీఈవో ద్వివేదిని కలిసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

అమరావతి: సీఈవో ద్వివేదిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కలిశారు. గుంటూరు జిల్లా ఇనిమెట్ల 160వ బూత్‌లో కోడెల దౌర్జన్యానికి దిగారని, ఆయనపై రాజుపాలెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని సీఈవోకు ఫిర్యాదు చేశారు. కోడెలతో కుమ్మక్కై వైయస్‌ఆర్‌సీపీ నేతలపై కేసులు పెట్టారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా తర్వాత రాజుపాలెం పోలీసులు కోడెలపై కేసు నమోదు చేశారని తెలిపారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ద్వివేదిని కోరారు. సీఈవోను కలిసిన వారిలో పార్టీ సీనియర్‌ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మ్రరి రాజశేఖర్, సామినేని ఉదయభాను, ఎంవీఎస్‌ నాగిరెడ్డిలు ఉన్నారు.
 

Back to Top