ఫిబ్రవరి 3న ఏలూరులో ‘సిద్ధం’ సభ

సభ ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ నేతలు

ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి లక్షలాదిగా తరలిరానున్న పార్టీ శ్రేణులు

ఏలూరు: ఫిబ్రవరి 3వ తేదీన ఏలూరులో ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల వైయస్‌ఆర్‌ సీపీ ‘సిద్ధం’ సభ నిర్వహించనున్నట్లు పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించనున్న వైయస్‌ఆర్‌ సీపీ క్యాడర్‌ సమావేశ ఏర్పాట్లను ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ మంత్రి ఆళ్ల నాని, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, పార్టీ సీనియర్‌ నేత పుత్తా ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రి పరిశీలించారు. ఈ సందర్భంగా సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు, పోలీస్‌ శాఖకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుందని, ఈ సందర్భంగా పార్టీ క్యాడర్‌ మీటింగ్‌కు వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. 

ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులు ఈ సమావేశానికి లక్షలాదిగా హాజరవుతారని వివరించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ క్యాడర్‌కు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తారన్నారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలను వైయస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లాలో, ఈస్ట్, వెస్ట్‌ గోదావరి జిల్లాల్లో ఇంత పెద్ద మీటింగ్‌ జరిగి ఉండకపోవచ్చన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, సీఎం వైయస్‌ జగన్‌ అభిమానులు సభకు హాజరై, జయప్రదం చేయాలని కోరారు. 
 

Back to Top