చంద్ర‌బాబు రైతు వ్య‌తిరేకి

రాష్ట్ర‌వ్యాప్తంగా `అన్న‌దాత పోరు`

రైతుల‌తో క‌లిసి ఆర్డీవోల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేసిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

తాడేప‌ల్లి: చంద్ర‌బాబు రైతు వ్య‌తిరేకి అని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు మండిప‌డ్డారు. రాష్ట్రంలో ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైయ‌స్ఆర్‌ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, రైతు సంఘాలు మంగళవారం శాంతియుత ఆందోళనలు నిర్వహించారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌కుండా కూట‌మి ప్ర‌భుత్వం కుట్ర‌లు చేస్తోంది. వైయ‌స్ఆర్‌ సీపీ నాయ‌కుల‌ను హౌస్ అరెస్టు చేసింది. నాయ‌కులు, రైతుల‌కు పోలీసులు నోటీసులు ఇచ్చి బెదిరించారు. నిర్బంధాల‌ను లెక్క చేయ‌కుండా రైతులు ఆర్డీవో కార్యాల‌యాల‌కు క‌దం తొక్కారు.

రైతులంటే చంద్రబాబుకు చులకన అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేత ఎస్వీ సతీష్‌రెడ్డి మండిపడ్డారు. కూటమి పాలనలో రైతులు అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైఎస్‌జగన్‌ హయాంలో రైతుల ఇంటి వద్దకే ఎరువులు వచ్చేవి. రైతుల పట్ల చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు. 

అనకాపల్లి జిల్లా: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అనకాపల్లి నర్సీపట్నం ఆర్టీవో కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పించామన్నారు. రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వానికి ముందు చూపులేదని మండిపడ్డారు. వైఎస్‌ జగన్ పాలనలో ఏనాడు రైతు ఇబ్బంది పడలేదు. ఆర్బికేలు ద్వారా సమయానికి యూరియా విత్తనాలు అందించాము. రైతులకు డోర్ డెలివరీ చేసి యూరియా విత్తనాలు అందించిన చరిత్ర వైయ‌స్ఆర్‌సీపీది.. ఎకరా ఉన్నా.. అర ఎకర ఉన్నా.. 5 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్న ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. కుటమి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.

Ysrcp Leaders Comments On Farmers Problems In Chandrababu Govt

ఏలూరు జిల్లా: మాజీ మంత్రి కారూమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులను ప్రభుత్వం హేళనగా మాట్లాడం దారుణమన్నారు. దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. పండించిన రైతుకి గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. ప్రజలకు ధరలు అందడం లేదుజ రైతులు లాభపడింది లేదు. ప్రజలు కూడా నష్టపోతున్నారు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది.? రైతులను నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీరు ఉంది.

మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేది. వెన్నుముక అయినా రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఏడాదిన్నర అయినా కూడా పూర్తి స్థాయిలో ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితి. రైతు పక్షాన పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆంక్షల పేరుతో నిర్బంధించడం దురదృష్టకరం. యూరియా సహా రైతులుకు అవసరమైన ఎరువులను వెంటనే పంపణీ చేయాలి. బ్లాక్ మార్కెట్‌ను నియత్రించాలి. ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఉచిత పంటల బీమాను పునరుదించి అందరికి వర్తింపజేయాలి. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలి.

తిరుపతి: అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరతను బఫేలా చూడటం దారుణం. యురియా బ్లాక్‌లో అమ్ముకొంటున్నారు. యూరియా ద్వారా రూ.300 కోట్లు బ్లాక్ మార్కెట్ దోచుకున్నారు. రైతుల సమస్యలు యురియా కొరతపై ఆర్డీవో వినతి పత్రం సమర్పించాము. కరోనా సమయంలో కూడా రైతులకు అండగా వైఎస్ జగన్ నిలిచారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు.

చెవిరెడ్డి అక్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. యురియా కొరతపై రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రైతులు యురియా కోసం నిలబడితే బఫే కోసం క్యూలో నిలబడ్డారని వ్యవసాయ శాఖ మంత్రి అనడం చాలా దారుణమన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు

ఎన్టీఆర్‌ జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ నేత దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ..  యూరిచాపై మాట్లాడితే కేసులు పెట్టమని చంద్రబాబు చెప్పాడు.. రైతులు ర్యాలీ చేస్తే దాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. రైతులను ఎక్కడికక్కడ అడ్డుకున్నా కానీ ముందుకు వచ్చాం.. ఆర్డీవోకి వినతి పత్రం ఇచ్చాం.

Back to Top