తిరుపతి: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు కిల్లి కృపారాణి అన్నారు. ఆమె కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కృపారాణి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని వైయస్ జగన్ అమలు పరుస్తున్నారని తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్ పెంపు, కిడ్నీ బాధితులకు పెన్షన్ విధానం వంటి నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు.