చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మరు..

రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభంజనం

పేదల కన్నీళ్లు తుడిచే నేత వైయస్ జగన్‌

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌సీపీ రాజమండ్రి సిటీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్‌రావు

రాజమండ్రి:రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ గెలుపుతో సునామి సృష్టించబోతుందని వైయస్‌ఆర్‌సీపీ రాజమండ్రి సిటీ  అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్‌రావు అన్నారు.రాజమండ్రిలో ఇంటింటికి  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల కష్టాలను కళ్లారా చూసిన వ్యక్తి  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని అన్నారు.ప్రజల దగ్గరకు వెళ్తే.. వైయస్‌ జగన్‌కే ఓటు వేస్తామంటూ ప్రజలందరూ స్వచ్ఛందంగా చెబుతున్నారన్నారు.పేదవారి కన్నీళ్లు తుడవడానికే మనం ఉన్నామని దివంగత నేత  వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అనేవారని, ప్రజలు మరిచిపోలేని విధంగా పాలన అందించారని తెలిపారు.వైయస్‌ జగన్‌ సీఎం అయితే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారన్నారు.తండ్రిని మించిన తనయుడు వైయస్‌ జగన్‌ పాలన అందిస్తారని ప్రజలందరూ సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు.

Back to Top