ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ఆర్‌సీపీ గెలుపు ఆపలేరు

పోలీస్‌ వ్యవస్థను టీడీపీ జేబు సంస్థగా మార్చుకుంది

వైయస్‌ఆర్‌సీపీ మచిలిపట్నం అభ్యర్థి పేర్ని నాని

కృష్ణా జిల్లా: బందరు పోర్టు విషయంలో తనపై  అక్రమ కేసులు పెట్టారని మంచిలిపట్నం వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ నేతలు రైతుల నుంచి 33 వేల  ఎకరాలను దుర్మార్గంగా దోపిడీకి  ప్రయత్నాలు చేస్తే రైతుపక్షాన పోరాటాలు చేశామన్నారు. ప్రత్యక్షంగా అధికారులను బెదిరింపులకు గాని, అడ్డుకోవడం గాని చేయలేదన్నారు.2015లో కేసులు నమోదు చేశారని, 2019, జనవరి 31 వరుకూ చార్జిషీటు వేయలేదన్నారు.ఎన్నికల సమీపంలో చార్జీషీటు వేశారన్నారు.నామినేషన్ల వేసేటప్పుడు నా మీద క్రిమినల్‌ కేసులు చూపించడానికి కొల్లు రవీంద్ర దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారన్నారు. పోలీస్‌ వ్యవస్థను కూడా తన జేబు సంస్థగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు.ఎన్ని అక్రమ కేసులు మోపిన భయపడేది లేదన్నారు.మచిలిపట్నం ప్రజలు వైయస్‌ జగన్‌ పాలనను కోరుకుంటున్నారని, కొల్లు రవీంద్ర  ఎన్ని కుట్రలు చేసిన వైయస్‌ఆర్‌సీపీ గెలుపును ఆపలేరన్నారు.

 

Back to Top