దళితుల పక్షపాతి వైయస్‌ జగన్‌

చంద్రబాబు దృష్టిలో దళితులు విధ్వంసకారులా..

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది..

వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటు అభ్యర్థి నందిగం సురేష్‌

గుంటూరు: ఒక సాధారణ కార్యకర్త,పేదవాడినైనా నన్ను బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టారంటే.. దళితుల పట్ల వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటు అభ్యర్థి నందిగం సురేష్‌ అన్నారు.దేశంలో ఎక్కడైనా అభ్యర్థుల జాబితా పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తారు. కాని సామాన్య కార్యకర్తగా ఉన్న నా చేత అభ్యర్థుల జాబితా చదివించారంటే దళిత జాతికి ఇచ్చిన గౌరవంగా పేర్కొన్నారు.రాష్ట్రంలో వెన్నుపోటు వీరుడు..ఓటుకు నోటు దొంగ..డేటా స్కాం దొంగ ఎవరని ఎద్దేవా చేశారు.  ఒక పక్క బీసీలను,ఒక్క పక్క ఎస్సీలను పెట్టుకుని వైయస్‌ జగన్‌ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే.. చంద్రబాబు ఒక ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ విధ్వంసకారులను,క్రిమినల్స్‌ను పక్కన  పెట్టుకుని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాబితా ప్రకంటిచారని  వ్యాఖ్యలు చేశారన్నారు.చంద్రబాబు దృష్టిల్లో బీసీలు,ఎస్సీలు,ఎస్టీలు విధ్వంసకారులా అని ప్రశ్నించారు.దళితుల పట్ల ఉద్దేశ్యం ఏమిటో ఒకసారి చంద్రబాబు ఆలోచించాలన్నారు.చంద్రబాబుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటేనే భయం అనుకున్నాం..కాని ఆయన కార్యకర్తలను చూసిన కూడా  భయపడుతున్నారన్నారు. 

Back to Top