రాష్ట్రంలో ఆకలి చావులు చంద్రబాబు పాపం కాదా..?

రాష్ట్రాన్ని దోచుకుతినటమేనా బాబు 40 ఏళ్ల అనుభవం 

చంద్రబాబు కనుసన్నల్లోనే కృష్ణా నదిని పూడుస్తున్నారు

పంచభూతాలను దోచుకుతిన్నది చంద్రబాబే..

చంద్రబాబును ప్రజలే కాదు..భగవంతుడు కూడా క్షమించడు

వైయస్‌ఆర్‌సీపీ నేత నందిగం సురేష్‌

హైదరాబాద్‌: కృష్ణనదిని పూడుస్తున్నా చంద్రబాబుకు కనిపించడంలేదా అని వైయస్‌ఆర్‌సీపీ నేత నందిగం సురేష్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఎన్నడూ లేని రీతిలో కృష్ణానదిని పూడుస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కన్నుసన్నల్లోనే   జరుగుతుందని ఆరోపించారు. అక్రమాస్తులను కూడబెట్టి రాష్ట్ర సంపదను అంతా ఆయన కుమారుడు లోకేష్‌కు దోచుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అమరావతి గుడి భూములు నుంచి  కృష్ణా ఇసుక నది ఇసుకను జన్మభూమి కమిటీలు,టీడీపీ నేతలు  దోచుకున్నారన్నారు.ఇక మిగిలిన  కృష్ణానదిని కూడా దోచుకోవడం మొదలుపెట్టారని మండిపడ్డారు.పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్‌లో లోకేష్‌కు అప్పజెప్పేవిధంగా ఇరిగేషన్‌ మంత్రి దేవినేని పనులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.కృష్ణానదిని పూడ్చమంటే భగవంతుడు కూడా క్షమించడన్నారు.

రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రజలు చంద్రబాబుకు పర్మిషన్‌ ఇచ్చారా అని ప్రశ్నించారు.రాజధాని భూములు,దళిత రైతులు,కూలీలను ఆగం చేశారన్నారు. ‘‘బ్రహ్మండమైన రాజధాని నిర్మిస్తాను.. సింగపూర్‌ టెక్నాలజీ అంతా నా చేతిల్లోనే ఉందని’’ గొప్పలు చెప్పిన చంద్రబాబు..ఆ టెక్నాలజీ అంతా కృష్ణానదిలో ఇసుకను అమ్ముకోవడానికి ఉపయోగిస్తున్నారన్నారు.అనుభవం గల వ్యక్తి అని చెప్పుకుంటూ చంద్రబాబు దౌర్భగమైన పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.మరో 20  రోజుల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్న  సందర్భంలో చంద్రబాబు.. ‘‘సమీక్షలు జరుపుతాను..కేబినెట్‌ను మొత్తం పిలిచి మాట్లాడుతాను..సచివాలయానికి అందరూ రావాలి.. రాకపోతే ఎట్లా రారో చూస్తాను..తర్వాత నేనే ఉంటాను’’ అంటూ బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు పూర్తిగా మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. పదవి పోతుందనే అక్కసుతో చంద్రబాబు భరించలేని స్థి«తిలో ఉన్నారన్నారు.

రాష్ట్రంలో నిన్న అకలితో అలమటించి మట్టి తిని చనిపోయారని..చంద్రబాబు మాత్రం తన బిడ్డకు వేలకోట్లు దోచుపెడుతున్నారు.రాష్ట్రంలో అన్నంలేక చనిపోవడం నీ పాపం కాదా అని ప్రశ్నించారు.ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన సమయంలో అగ్రిగోల్డ్‌ బాధితుల హాయ్‌ల్యాండ్‌ను కూడా కాజేశారు. రాష్ట్రం మొత్తం మీద పంచభూతాలను దోచుకుతిన్నారంటే అది చంద్రబాబు,టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే అని అన్నారు.దుర్మార్గమైన పనులు చేసి ఏమి తెలియని వ్యక్తిలా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు.ప్రజల సొమ్మ్రు ప్రజలకే చెందాలన్నారు.రాష్ట్ర సంపదను దోచుకున్నవారిని కటకటాల వెనక్కి పంపిస్తామన్నారు.చంద్రబాబును ప్రజలే కాదు..భగవంతుడు కూడా క్షమించడన్నారు.

తాజా ఫోటోలు

Back to Top