టీడీపీ పాలనలో అరాచకాలు పెరిగిపోయాయి..

మళ్లీ టీడీపీకి ఓటేస్తే విజయవాడ గుండాలకు కేంద్రంగా మారుతుంది

రాజకీయంగా ఎదుర్కోలేక నాపై అక్రమ కేసులు పెట్టారు

వైయస్‌ఆర్‌సీపీ విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి మల్లాది విష్ణు

 

విజయవాడ:టీడీపీ పాలనలో అరాచక పాలన సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి మల్లాది విష్ణు అన్నారు. ఆయన  వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రౌడీలను తలపిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు  ఐదేళ్లు పాలించారని, రౌడీయీజం,గుండాయీజం చేసేవాళ్లు మళ్లీ ఓటు వేయండని బయలుదేరారని, వీరికి ఓటు వేస్తే విజయవాడ మళ్లీ గుండాలకు రాజధానిగా మారిపోతుందన్నారు.ఒకసారి గెలిస్తేనే విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఎన్ని కబ్జాలు,దౌర్జన్యాలు,సెంటిల్‌మెంట్లు, బెదిరింపులు చేశారో ప్రజలు చూశారన్నారు.పట్టపగలే విజయవాడ నగరంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి,టాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ సుబ్రహ్మణంను బెదిరింపులకు దిగి దౌర్జన్యాలకు పాల్పడ్డారు.మళ్లీ టీడీపీ గెలిస్తే విజయవాడ నగరంలో సామాన్యులు,మధ్యతరగతి ప్రజలు బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదన్నారు.

వైయస్‌ఆర్‌సీపీకి ప్రచారం చేస్తున్న ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నానా దుర్భాషలాడి, అందరి సమక్షంలో కులాన్ని కించపరిచి మాట్లాడరన్నారు.ఇలాంటి దౌర్జన్యపూరితమైన వాతావరణం తెలుగుదేశం ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నారన్నారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత,బొండా ఉమామహేశ్వరరావు లాంటివారు ఎమ్మెల్యేలు అయిన తర్వాత నగరంలో అరాచకాలు పెరిగిపోయాయన్నారు.సంఘవిద్రోహ శక్తులకు కేంద్రంగా విజయవాడ నగరం మారింది. మాకు సంబంధంలేకపోయిన కూడా కల్తీ మద్యం కేసులో ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు మాపై రెండు కేసులు కట్టారన్నారు.ఎక్చైజ్‌ డిపార్ట్‌మెంట్‌ కట్టిన కేసులో నా పేరు లేదన్నారు. సిక్స్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో తెలుగుదేశం నాయకులు,పెద్దలు కుట్రతో రాజకీయ ప్రత్యర్థులను ఇరిక్కించాలనే కక్షతో నాపై కేసులు పెట్టారన్నారు.పోలీసులు విచారణలో స్టేట్,అండ్‌ సెంట్రల్‌ అఫిషియల్‌ రిపోర్ట్‌ ప్రజల ముందు పెడుతున్నాను.ఈ రిపోర్ట్‌లో ఏముందో చూసుకోవాలని బొండా ఉమాను కోరారు.కల్తీకాదని ఛార్జీషీటులో రిపోర్ట్‌ ఇచ్చారని పేర్కొన్నారు.

Back to Top