గుంటూరు: వంద రోజుల పాలనలో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. సీఎం వైయస్ జగన్ ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు, ఆయన తోక పత్రికలు పేపర్ లీకైందని పిచ్చిరాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు వార్తకు నిరసనగా గుంటూరులో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువత ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తప్పుడు వార్త రాసిన ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం వైయస్‌ఆర్ సీపీ సీనియర్ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. వంద రోజుల పాలనలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన నాయకుడు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎవరూ లేరని, ఆ ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కే దక్కుతుందన్నారు. వైయస్ జగన్ ప్రజా పరిపాలన, సుపరిపాలన అందించేందుకు అడుగులు వేస్తున్నారన్నారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వంద రోజుల్లోనే నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. ఇది చూసి ఓర్వలేక చంద్రబాబు, ఎల్లోమీడియా పిచ్చిరాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష పశ్నాపత్రాలను జేఎన్టీయూ వారు ప్రిపేర్ చేశారని, అది కూడా ఏపీపీఎస్‌సీ పర్యవేక్షణలో జరిగిందన్నారు. పశ్నాపత్రం లీకైతే పరీక్షల రోజు వార్త రావాలి కానీ, ఫలితాలు విడుదలైన రోజు రాయడం ఏంటని ప్రశ్నించారు.