తాడేపల్లి: నిన్న జరిగిన ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ ప్రవర్తన దేశానికి అవమానకరంగా మారిందని వైయస్ఆర్‌సీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటన ప్రతి భారతీయుడినీ సిగ్గుపడేలా చేసిందని ఆయన ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. “నిన్న ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ ప్రవర్తన మనందరినీ సిగ్గుపడేలా చేసింది. మన రాజకీయాలు ఎటు దిశగా సాగుతున్నాయి? ఎట్టి పరిస్థితుల్లోనూ మన దేశాన్ని అవమానించేలా ఎవ్వరూ ప్రవర్తించకూడదు. రాజకీయ భేదాలు ఎలా ఉన్నా, ప్రపంచ వేదికలపై మనం ఎప్పుడూ ఐక్యంగా కనిపించాలి” అంటూ ఆయన ట్వీట్ చేశారు. దేశ గౌరవం, ప్రతిష్టల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలని, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను గౌరవప్రదంగా ప్రతినిధ్యం వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వైయస్ జగన్ స్పష్టం చేశారు.