సర్కార్‌ దిగొచ్చేంతవరుకూ పోరాటం ఆగదు..

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, అగ్రిగోల్డు బాధితుల బాస‌ట క‌మిటీ అధ్య‌క్షుడు లేళ్ల అప్పిరెడ్డి

అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసటగా వైయస్‌ఆర్‌సీపీ ధర్నా 

విజ‌య‌వాడ‌: అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసేందుకు సర్కార్‌ దిగొచ్చేంతవరుకూ వైయస్‌ఆఆర్‌సీపీ  పోరాటం ఆగదని  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, అగ్రిగోల్డు బాధితుల బాస‌ట క‌మిటీ అధ్య‌క్షుడు లేళ్ల అప్పిరెడ్డి హెచ్చ‌రించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసటగా రాష్ట్రవాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ..అగ్రిగోల్డ్‌లో లక్షల మంది సామాన్య ప్రజానీకం డిజిపాట్లు చేశారు.33 లక్షల మందిపైగా ఖాతాదారులు,8లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు.ఏళ్లు గడుస్తున్నా బాధితులకు న్యాయం దక్కలేదు.

దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణం అగ్రిగోల్డ్‌ వ్యవహారం. బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేయడానికి పన్నాగాలు పన్నుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు విమర్శించారు.రాష్టవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులు,ఏజెంట్లు  250 మంది చనిపోయారని తెలిపారు. అయినా కూడా టీడీపీ ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు.బాధితులంతా ధైర్యంగా ఉండాలని కోరారు.బాధితులు ఆందోళన చెందకుండా ఎటువంటి ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. వైయస్‌ జగన్‌ సీఎం అయినవెంటనే అగ్రిగోల్డ్‌ బాధితులందరికి న్యాయం చేస్తారని తెలిపారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఏ విధంగా కొట్టేయాలన్న ఆలోచన మాత్రమే ప్రభుత్వానికి ఉందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 260 మంది ఆత్మహత్య చేసుకుంటే.. ప్రభుత్వం 140 మందికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల జాబితాను ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాబితాలో తమ పేరు ఉందో లేదో అని అగ్రిగోల్డ్‌ బాధితులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే 1180 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. బాధితులకు చివరి పైసా వచ్చేవరకు వారి తరఫున పోరాటం చేస్తామన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పెద్దలు కొట్టేసిన అగ్రిగోల్డ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుని.. దొంగలను జైలుకు పంపుతామని హెచ్చరించారు.

ముస్తాఫా మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును టీడీపీ నాశనం చేసిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం 50 ఏళ్ల వెనక్కి వెళ్లిందన్నారు. అగ్రిగోల్డ్‌ సంస్థకు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్న ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయలేకపోయిందని మండిపడ్డారు. బాధితులు ధైర్యంగా ఉండాలని.. వారికి వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని తెలిపారు.

నందిగం సురేశ్‌ మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కయిందని ఆరోపించారు. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసే పరిస్థితిలో లేదన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కారం అవుతుందని భరోసా నిచ్చారు. వైఎస్సార్‌ సీపీ బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే 1182కోట్లు విడుదల చేసి 80 శాతం అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటారని, అనంతరం అగ్రిగోల్డ్‌ ఆస్తులను విక్రయించి ప్రతి బాధితునికి ప్రతిపైసా చెల్లిస్తారని భరోసా ఇచ్చారు.విజయవాడ,గుంటూరు, కాకినాడ, అనంతపురం,విశాఖపట్నం,ఏలూరు,కర్నూలు,శ్రీకాకుళం,విజయనగరం,ఒంగోలు,తిరుపతి,కడప,నెల్లూరు పట్టణాల్లో ధర్నాలు నిర్వహించారు.

Back to Top