ఆ ముగ్గురు నాయుళ్లు జైలుకు వెళ్లడం ఖాయం

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి 
 

రాజమండ్రి: గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని పడిపడి దోచుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, సుజనా నాయుడు జైలుకి వెళ్లడం ఖాయమని, వారు జైలుకు వెళ్తే చూడాలని ఉందన్నారు. సోమవారం ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ భూములపై గత ప్రభుత్వం సిట్‌ వేసి చిన్న ఉద్యోగులను బలిచేశారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన సిట్‌ ద్వారా వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. సిట్‌ అధికారులు, కేంద్ర బృందాలు సమన్వయంతో​ పకడ్బందీగా పనిచేస్తారని తెలిపారు. మళ్లీ తాను అధికారంలోకి వస్తే చంద్రబాబుని అండమాన్‌ జైలు పంపించాలని ఉందని ఎన్టీఆర్‌ అంటుండే వారు. ఆ రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నా’ అంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు

తాజా వీడియోలు

Back to Top