టీడీపీ దౌర్జన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

అనంతపురం జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు వినతి పత్రం అందజేశారు. విడపనకల్ మండలం వేల్పుమడుగు గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు చెందిన భూముల్లో టీడీపీ నేతలు అన్యాయంగా జోక్యం చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ కక్షతోనే ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మారిన తర్వాత నుంచి వైయ‌స్ఆర్‌సీపీ నేతల భూములను లక్ష్యంగా చేసుకుని అక్రమ దాడులు, బెదిరింపులు పెరిగాయని తెలిపారు. ఈ చర్యల వల్ల గ్రామంలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటనలపై తక్షణమే విచారణ చేపట్టి, దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను వై. విశ్వేశ్వరరెడ్డి కోరారు. అలాగే బాధితులకు రక్షణ కల్పించాలని, భూములపై అక్రమాల‌ను అడ్డుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై అక్రమాలు, దౌర్జన్యాలు కొనసాగితే ప్రజాస్వామ్య విలువలకు భంగం కలుగుతుందని ఆయన అన్నారు. జిల్లా యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయం చేయాలని కోరారు. క‌లెక్ట‌ర్‌ను క‌లిసిన వారిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top