సీఎం వైయస్‌ జగన్‌ అందరివాడు

పాలనలో  సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శం

మతాల మధ్య చంద్రబాబు చిత్తు  

వైయస్‌ఆర్‌సీపీ నేత జూపూడి ప్రభాకర్‌ రావు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అందరి వాడని వైయస్‌ఆర్‌సీపీ నేత జూపూడి ప్రభాకర్‌ రావు పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన ప్పటి నుంచి చంద్రబాబుకు నిద్ర కరువైందన్నారు. టీడీపీని ప్రజలు తిరస్కరించారని, ప్రజా తీర్పును టీడీపీ నేతలు హేళన చేస్తున్నారని తప్పుపట్టారు.నవరత్నాల పథకాలతో దేశానికే ఏపీ ఆదర్శం కాబోతుందన్నారు.  పాలనలో సీఎం వైయస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయలు దేశానికే ఆదర్శమన్నారు. వైయస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణను టీడీపీ తట్టుకోలేకపోతుందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ను అభాసుపాలు చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. మత్తయ్యను చంద్రబాబు పావుగా వాడుకొని లేఖలు రాయిస్తున్నారని పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుతో పాటు మత్తయ్య కూడా నిందితుడేనని గుర్తు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ధ్వజమెత్తారు.

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది

తాజా ఫోటోలు

Back to Top