చుట్టపు చూపుగా వచ్చే వ్యక్తి ఎమ్మెల్యేనా..?

హిందూపురం వైయస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి ఇక్బాల్‌

అనంతపురం:అన్నివర్గాలకు మేలు జరగాలంటే వైయస్‌ జగన్‌ను సీఎంను చేయాలని వైయస్‌ఆర్‌సీపీ హిందూపురం అభ్యర్థి ఇక్బాల్‌ అన్నారు.హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వచ్చేవారని ప్రజలు చెబుతున్నారని తెలిపారు.చంపుతా..బాంబులు వేస్తా అని బెదిరించే వ్యక్తి ప్రజాప్రతినిధా అని ప్రశ్నించారు. టీడీపీపై పాలనపై ప్రజలు విశ్వసనీయత కోల్పోయారన్నారు. నియోజకవర్గంలో అనేక గ్రామాలు తిరిగామని ప్రజలు మంచినీటికి కటకటలాడుతున్నారన్నారు.కనీస ప్రజలకు కావాలిన ప్రాథమిక,మౌలిక సదుపాయాలను కల్పించడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. 

 

Back to Top