రామోజీ, చంద్రబాబు కుట్ర మేరకే ఈనాడులో దుష్ప్రచారం

వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి కొడాలి నాని

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక భాగం కేటాయింపు

పట్టాభిని గన్నవరం ఎవరు పంపించారు?

పథకం ప్రకారం దాడి చేసి సీఐని కొడితే కేసు పెట్టరా ?

 అసత్యాలను సత్యాలుగా నమ్మించాలనేదే రామోజీ కుట్ర

 రామోజీ తాను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు

 గతంలోనూ ఎన్టీఆర్‌పై రామోజీ కుట్ర చేశారు

రామోజీవి అన్ని అసత్య కథనాలు, అభూత కల్పనలే

ఈనాడు తప్పుడు వార్తలపై రామోజీరావు క్షమాపణ చెప్పాలని కొడాలి నాని డిమాండు

తాడేపల్లి: రామోజీ, చంద్రబాబు కుట్ర మేరకే గన్నవరం ఘటనపై ఈనాడులో దుష్ప్రచారం చేశారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాస్తున్న ఈనాడు అధినేత రామోజీరావు వైఖరిని మాజీ మంత్రి కోడాలి నాని తీవ్రంగా తప్పు పట్టారు. గురువారం కొడాలి నాని తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

 రామోజీ క్షమాపణలు చెప్పు-లేదంటే ఊరూరా ఈనాడు తగలబెడతాంః
- రామోజీ...నువ్వు గతంలోలా పిచ్చి రాతలు రాస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకోవద్దు. నిన్ను, చంద్రబాబును బట్టలు ఊడదీసి రాష్ట్ర ప్రజల మధ్య నిలబెడతాం
- నిన్న నాలుగు పేజీల్లో పట్టాభి బొమ్మలు వేసి, ఏదైతే  తప్పుడు ప్రచారం చేశావో,  అదే రీతిలో రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్సీపీకి, జగన్‌ గారికి, రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థకి క్షమాపణలు చెప్పాలి
లేదంటే రేపటి నుంచీ ఊరూరా నీ దిష్టిబొమ్మలను, నీ పేపర్‌ను తగలబెడతాం.
- నువ్వెంత నీచుడువో, 420 గాడివో రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతాం. నువ్వు, నీ కీలుబొమ్మ చంద్రబాబు ఈ రాష్ట్ర సంపదను దోచుకోవడానికి చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తాం
- మీ ఉడుత ఊపులకు ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరు..ఇక్కడున్నది జగన్మోహన్‌రెడ్డి గారు. ఎన్టీఆర్‌లా రాజకీయాలు తెలియని,  వయసు అయిపోయిన వ్యక్తి జగన్మొహన్‌రెడ్డి గారు కాదు.
- జగన్‌ గారు యువ నేత...నీలాంటి 420 గాళ్లను చాలా మందిని చూసిన వ్యక్తి. ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టినట్లు ఇబ్బంది పెడదామంటే చూస్తూ ఊరుకోవడానికి ఆయనేమీ వృద్ధ సింహం కాదు. నీలాంటి పనికి మాలిన వాళ్లని చాలా మందిని చూసి వచ్చిన యువ సింహం జగన్‌ గారు..
- పొరపాటు జరిగింది అని 50 ఏళ్లుగా..  నిన్ను పెంచి పోషిస్తున్న పాఠకులకైనా క్షమాపణలు చెప్పాలి కదా.. సిగ్గూ, ఎగ్గూ నీతి, నిజాయితీ అన్నిటినీ గాలికి వదిలేసి, ప్రభుత్వాన్ని, జగన్‌ గారి వ్యక్తిత్వాన్ని బ్రష్టు పట్టించడం తప్ప వేరే కార్యక్రమం పెట్టుకున్నట్లు లేరు మీరు.  ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తే రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు
- ఆఖరి వయసులోనైనా బుద్ధి తెచ్చుకుని సరైన ఖండన ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా.

కావాలనే పాత ఫోటోలు అచ్చేసి.. దొరికిపోయిన దొంగ రామోజీ:
- నీకు 2021 నాటి ఫోటోలు తీసుకొచ్చి ఎవరిచ్చారు..?.  నీ టేబుల్‌ మీద ఉన్న ఒక ఫోటో బదులు మరొక ఫోటో వేస్తే సాంకేతిక లోపం అంటారు. 2021 నాటి ఫోటోలు నీ టేబుల్‌ మీదకు ఎలా వచ్చాయి..?. రెండు రోజులు అటో ఇటో ఉన్న ఫోటోలు మారాయి అంటే దానికో అర్ధం ఉంది.  మూడేళ్లనాటి పట్టాభి ఫోటోలు నీకు ఎవడిచ్చాడు..?
- నువ్వు కావాలని, వెతికి తీసి వాటిని ప్రచురించి ప్రభుత్వాన్ని బ్రష్టు పట్టించాలని ప్రయత్నం చేశావు
- ఈ రాష్ట్ర ప్రజలకు దొంగలా దొరికిపోయి సాంకేతిక లోపం అంటావా..? సిగ్గు లేదా నీకు..?. వయసు రాగానే సరిపోదు... దాదాపు 90 ఏళ్లు వచ్చాయి...ఇంకేం కట్టుకుపోతారు ఆ చంద్రబాబు, నువ్వూ కలిసి..?
- రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి పేదల్ని ఇంకా కిందకు తొక్కేసి ఏం చేయాలనుకుంటున్నారు
- ఎన్టీఆర్‌ని పొట్టనపెట్టుకున్నావ్‌..రాజశేఖరరెడ్డి గారిని పొట్టన పెట్టుకోవడానికి ప్రయత్నించావ్‌.. ఇప్పుడు జగన్‌ గారిని తినేయాలని ప్రయత్నిస్తున్నావ్‌..ఎందుకు ఈ సిగ్గులేని జన్మ నీకు..?. 

బాబును గద్దెనెక్కించడానికి నాడు ఎన్టీఆర్ పై రామోజీ దాడి చేశాడుః
- గత రెండు రోజులుగా ఒక పనికిమాలిన పట్టాభి చుట్టూ రాష్ట్ర రాజకీయాలను తిప్పాలని చంద్రబాబు, రామోజీరావు ప్రయత్నం చేస్తున్నారు
- తాను గొప్ప వ్యక్తినని, ఈ రాష్ట్ర ప్రజలు తాను ఏమి చెప్పినా నమ్ముతారని ఓపెద్ద మనిషి ప్రయత్నం చేస్తున్నాడు- తాను అసత్యాన్ని సత్యంగా నిరూపించగలను అనుకుంటున్నాడు
- గతంలో నీ ఆటలు చెల్లినవేమో గానీ...ఇప్పుడు నీకు వ్యతిరేకంగా సాక్షి, వైఎస్‌జగన్‌ గారు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు, సోషల్ మీడియా ఉన్నాయి. మీరు చేసే కుట్రలను, మీ బట్టలూడదీసి ప్రజల మందు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం.
- ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు ఆయన బొమ్మలేసుకుని ఆయన్ని ముఖ్యమంత్రిని చేశాననే భ్రమల్లో రామోజీ ఉన్నాడు. వాస్తవానికి,  ఎన్టీఆర్ పార్టీ పెట్టాకే.. ఈనాడు సర్క్యులేషన్ 40 వేలు నుంచి  మూడు లక్షలకు పెరిగిందని ఆనాడే ఎన్టీఆర్‌ రామోజీకి ఘాటుగా సమాధానమిచ్చారు. "నా బొమ్మలేసి, నా వార్తలు రాసి, నీ పేపర్‌ సర్క్యులేషన్‌ పెంచుకున్నావని ...అలాంటిది నువ్వు నన్ను ముఖ్యమంత్రిగా చేయడం ఏంటని" ఎన్టీఆర్‌ ఆనాడే ప్రశ్నించాడు. చంద్రబాబు చుట్టూ ఉన్న ఈ దొంగలు, 420ల చేతుల్లో ఎన్టీఆర్‌ కీలు బొమ్మలా మారలేదు. అందుకే ఎన్టీఆర్‌పై కుట్ర చేసి, ఎన్టీఆర్‌ ఒక నీచుడు అని...ఒక ఆడదానికి దాసోహం అయ్యి పార్టీని, ప్రభుత్వాన్ని ఒక ఆడదానికి అప్పజెప్తున్నాడని నిందలు వేశారు. 
-ప్రజల్లో బలం లేని చంద్రబాబు లాంటి కీలుబొమ్మ అయితే చెప్పుకింద పడిఉంటాడని బాబును ముఖ్యమంత్రిగా చేయడానికి ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా వార్తలు రాశాడు రామోజీ. చంద్రబాబును గద్దెనెక్కించడానికి ఎన్టీఆర్‌పై పత్రికను అడ్డం పెట్టుకుని రామోజీ దాడి చేశాడు

ఎన్టీఆర్‌ ఉంటే మద్యపాన నిషేధం.. బాబు వస్తే నిషేధం వల్ల నష్టంః ఇదీ రామోజీ బాగోతం:
- ఎన్టీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు మద్యపాన నిషేధం చేయాలని రాతలు రాశాడు రామోజీ. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, చంద్రబాబును గద్దెనెక్కించిన తర్వాత... మద్యపాన నిషేధం వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోతోంది..ప్రజలు నాటుసారా తాగుతున్నారని ఇదే రామోజీ రివర్స్ లో వార్తలు రాశాడు. ఆనాడు ఎన్టీఆర్‌ పెట్టిన మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి.. ఎత్తేయించిన ఘనుడు రామోజీనే.  పేదలకు ఇచ్చే సంక్షేమం వల్ల అభివృద్ధి జరగడం లేదని, చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ దొంగమాటలు రాసి సంక్షేమ పథకాలను రద్దు చేయించిన నీచుడు రామోజీ. 
- రాశేఖరరెడ్డి గారు జలయజ్ఞం చేపడితే అవినీతి అంటూ దుర్మార్గమైన రాతలు రాసిన దుర్మార్గుడు రామోజీ. 
- జగన్‌ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పేపర్లో యాడ్స్‌ రావడం లేదట. 
- వైజాగ్‌లో 2వేల ఎకరాల్లో స్టూడియో కట్టడానికి జగన్‌ గారు పర్మిషన్ ఇవ్వడం లేదట. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే వైజాగ్‌లో కూడా ఒక స్టూడియో కట్టేవాడు రామోజీ. 
- ఈనాడు, ఈటీవీకి ప్రత్యామ్నాయంగా సాక్షి, సాక్షిటీవీ పెట్టి జగన్మోహన్‌రెడ్డి గారు రామోజీ మొడలు వంచి ఇంట్లో కూర్చోబెట్టాడు. ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను అడ్డుపెట్టుకుని రామోజీరావు లాంటి వారు పైరవీలు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేశాడు.
- అందుకే జగన్మోహన్‌రెడ్డి గారిని కూడా దించేసి చంద్రబాబును గద్దెనెక్కించాలని ఈ దుష్టచతుష్టయం అంతా  ప్రయత్నం చేస్తుంది.
- ఉదయం లేచినప్పటి నుంచీ జగన్‌ గారిని ఎలా దించాలి...చంద్రబాబును ఎలా ఎక్కించాలి...రాష్ట్ర సంపదను ఎలా కొల్లగొట్టాలనే ఆలోచనతో అభూత కల్పనలు రాస్తున్నాడు

పట్టాభి బొమ్మలేసుకునే స్థాయికి దిగజారావా రామోజీ..?
- పట్టాభిని స్టేషన్లన్నీ తిప్పి కొట్టారని దొంగ ఫోటోలను రామోజీ ఈనాడు ఫస్ట్ పేజీలో ప్రచురించాడు. రామోజీరావు స్థాయి దిగజారిపోయి, ఆఖరికి పట్టాభి బొమ్మలేసుకుని వార్తలు రాసుకుంటున్నాడు. పట్టాభిని కూడా కొట్టారు అంటాడు...అతనేమన్నా దిగివచ్చాడా..? పోలీసులపై దాడి చేస్తే చర్యలు తీసుకోరా..?
-ఉచ్ఛ,నీచాలు వదిలేసి పాత ఫోటోలు వేసి కొత్త రాతలు రాస్తున్నాడని, రామోజీకి మతి భ్రమించిందని ప్రజలు అనుకుంటున్నారు. ఇంత వయసొచ్చినా రామోజీకి బుద్ధి రాలేదని రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తే.. ఈ రోజు కనపడకుండా సవరణ ఇచ్చాడు
- ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఆపేయాలని, ఆ నలుగురు రాష్ట్రాన్ని దున్నపోతుల్లా మేసేయాలని ప్రయత్నం చేస్తున్నారు

పట్టాభిని గన్నవరం పంపించింది చంద్రబాబే:
- పట్టాభిని గన్నవరం ఎవరు పంపించారు..?మేము పంపించామా..?
- 18 మంది ఎమ్మెల్సీల్లో 14 పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారు. బీసీలు వెన్నెముక అని చెప్పుకుని.. పార్టీ పదవులు మాత్రం అమ్ముకునే చరిత్ర ఇప్పటి వరకు టీడీపీ కొనసాగించింది. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్, వైఎస్సార్‌లు బడుగు బలహీనవర్గాలకు ఇచ్చిన ప్రాధాన్యం కంటే అధికంగా ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ గారు. దాన్ని తట్టుకోలేక ఈ 420లంతా పనికిమాలిన బూతుల పట్టాభిని గన్నవరం పంపారు. అక్కడకు వెళ్లి గన్నవరం సెంటర్లో నిలబడి వంశీని పట్టుకుని, నువ్వు మగాడివైతే రారా అని రెచ్చగొట్టింది పట్టాభి కాదా.. ఒక అమ్మా అబ్బకు పుడితే నేను ఇక్కడే పార్టీ ఆఫీసులో ఉన్నా రారా అని పట్టాభి రెచ్చగొట్టాడు. వంశీ అనుచరులు అక్కడకు వెళ్లేసరికి ఇతను పోలీసు స్టేషన్‌కి వెళ్లాడు. అక్కడ పోలీసులు అడ్డుపడితే పట్టాభి, తాను బెజవాడ నుంచి తీసుకెళ్లిన గూండాలతో కలిసి సీఐ తల పగులగొట్టాడు. లావుపాటి జెండా కర్ర భుజం మీద పెట్టుకుని వెళ్లాడు. దానితో వంశీ మనుషులను కొట్టాలని ప్రయత్నం చేసి మధ్యలో అడ్డుగా ఉన్న సిఐ తల పగులగొట్టాడు. అంటే సీఐ తల పగులగొట్టినా కేసు పెట్టరా..?
- గన్నవరం వెళ్లింది పట్టాభి..అతన్ని పంపించింది 420 చంద్రబాబు
- బీసీలకు మెజార్టీ ఎమ్మెల్సీ సీట్లు దక్కిన విషయాన్ని ప్రజల్లోకి వెళ్లకూడదని చంద్రబాబు, ఎల్లో మీడియా రోజంతా డ్రామా నడిపారు.

దున్నపోతు ఈనిందంటే.. వాళ్ళు ఎగేసుకుని వస్తారుః
- చంద్రబాబు, రామోజీలు ఇద్దరూ.. దున్నపోతు ఈనింది దూడను కట్టేయండి... అనగానే పవన్‌ కళ్యాణ్, సీపీఐ రామకృష్ణ, చికెన్‌ నారాయణ ఎగేసుకుని వస్తారు
- పట్టాభి గన్నవరం వెళ్లాడు..తన్నులు తిన్నాడు..పోలీసులను కొట్టాడు..కేసు పెట్టించుకున్నాడు. ఇలాంటి వాళ్లు రాష్ట్రంలో బోలెడంత మంది రోజూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు..అది కూడా ఒక న్యూసా. బీసీలపై దాడి చేసింది ఎవరు..? . ఈ వివాదంలో వైఎస్సార్సీపీ, టీడీపీ వాళ్లకు ఒక్క దెబ్బకూడా తగలలేదు. మధ్యలో ఉన్న పోలీసులకు మాత్రం తలపగిలింది...
అలాంటి పోలీసు వ్యవస్థపై అబాంఢాలు వేస్తున్నారు..అక్కడున్న సీఐ ఒక ఎస్సీ వ్యక్తి...విధినిర్వహణలో అక్కడ ఉన్నాడు కాబట్టే ఆయనకు దెబ్బలు తగిలాయి.
- వైఎస్సార్సీపీ వాళ్లు అక్కడ వెయ్యి మంది ఉంటే.. పట్టాభి, టీడీపీ వాళ్లు అక్కడ 100 మంది ఉన్నారు. మధ్యలో పోలీసు వాళ్లు లేకపోతే పట్టాభి పరిస్థితేంటి...?. అతన్ని రక్షించి, అతను తినాల్సిన దెబ్బలను సిఐ తింటే నీ అంతుచూస్తానంటూ మాట్లాడతారా..?
- సీఐ అపస్మారక స్థితిలోకి వెళ్లి తొమ్మిది కుట్లు పడ్డాయి..ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాడు. ఇంత చేస్తే 307 కేసు పెట్టకుండా ఏం చేస్తారు..?
- దుష్టచతుష్టయం ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు
-పట్టాభి మీడియాలో మమ్మల్ని, జగన్‌ గారిని తిట్టి రాజకీయంగా ఎదగాలనే పిచ్చి ప్రయత్నం చేస్తున్నాడు. పార్టీ ఆఫీసులో రెండు కుర్చీలు విసిరేసి రెండు గ్లాసులు పగలగొట్టారు
పోలీసులు అడ్డుకుని వారిని బయటకు పంపించారు. బయట ఉన్న కారును ఎవడో తగులబెట్టాడు.. దానికి రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందంటూ దీన్ని జగన్‌ గారికి అంటకడుతున్నారు
ఒళ్లు పెరిగింది కానీ..బుర్ర పెరగని పట్టాభిని అక్కడికి పంపి వీళ్లంతా కుట్ర చేశారు

పట్టాభి ఏమైనా బీసీ నాయకుడా..?ః
- బీసీపై దాడి అంటూ వీళ్లంతా బీసీలపై విపరీతమైన ప్రేమ చూపుతున్నారు . పట్టాభితో పాటు అరెస్టు అయిన వారిలో బీసీలు ఉన్నారు...మిగిలిన కులాల వారు కూడా ఉన్నారు
కానీ చంద్రబాబు మాత్రం పట్టాభి ఇంటికి మాత్రమే వెళ్లాడు..పట్టాభి ఏమైనా బీసీ నాయకుడా..?
- ఉయ్యూరు నుంచి చంద్రబాబు కంటే ముందు నుంచీ టీడీపీలో ఉన్న గురుమూర్తి అనే నాయకుడు కూడా అక్కడ ఉన్నాడు. ఈ గొడవలో అతను కూడా ఉన్నాడు కదా...అతని ఇంటికి చంద్రబాబు ఎందుకు వెళ్లలేదు..?. నీ సామాజిక వర్గంలో ఉన్న పట్టాభికి మాత్రమే భార్యాపిల్లలు ఉన్నారా..? మిగిలిన నాయకులకు భార్యా పిల్లలు లేరా..? వాళ్లెవరూ అరెస్టయితే ఏడవలేదా..?. మీ ఈటీవీ, ఏబీఎన్‌లు వాళ్లింటికి ఎందుకు వెళ్లలేదు..?
- పంది పట్టాభి గాడ్ని తీసుకొచ్చి మీడియా ముందు అబద్ధాలు ఆడిస్తాడు. ఆ 11 మందిలో ఒక్క పట్టాభి తప్ప ఎవరూ కొట్టారని చెప్పలేదు. బుద్ధిలేని రామోజీరావు పాత ఫోటోలు తీసుకొచ్చి వేశాడు
రాష్ట్ర ప్రజలు గమనించాలి...వీళ్లంతా ఒకటే గ్యాంగ్‌..చంద్రబాబును గద్దెనెక్కిస్తే వీళ్లకి బాగుంటుంది.  జగన్‌ గారు ఉంటే వీళ్ల ఆటలు సాగవు... వీళ్ళను పట్టించుకోడు
- 420 గ్యాంగ్‌కి ప్రజల్లో మద్దతు లేదు..పవన్‌ కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణ లాంటి వాళ్లు తనను కుర్చీలో కూర్చోబెట్టకపోతారా అని వీళ్ళ కోరిక. 50 ఏళ్ల నుంచి ఈ 420 గాళ్ల రాతలు చూసి చూసీ ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే జగన్‌గారు అక్కడున్నారు..చంద్రబాబు రోడ్డుమీదున్నాడు. 

 40 కోట్ల డీల్‌ అని లోకేశ్‌కి ముందే ఎలా తెలిసింది..?

- 20 రోజుల క్రితమే లోకేశ్‌ వివేకా హత్యలో 40 కోట్ల డీల్‌ జరిగిందని చెప్పాడు. ఈ రోజు కౌంటర్లో సీబీఐ అదే ఇచ్చింది..మరి లోకేశ్‌కి 20 రోజుల క్రితం ఎలా తెలిసింది..ఆయనకు ఎవరు చెప్పారు..? 
రాష్ట్రంలో జగన్‌ గారిని అడ్డుకోవడానికి గతంలో సోనియాగాంధీ, టీడీపీ కలిసి 12  సీబీఐ కేసులు పెట్టారు. దాంట్లో 74 మంది ఉన్నారు..అనేక సంస్థలనున్నాయని కేసులు పెట్టారు
వారిలో 30 మంది డిచ్ఛార్జి పిటిషన్లు వేసుకున్నారు...వారికి సంబంధం లేదని హైకోర్టు తొలగించింది. 
- ఈ పచ్చ గ్యాంగ్‌ 20 రోజులు క్రితం చెప్పిన స్క్రిఫ్ట్‌ అంతా సీబీఐ వాళ్లు ఇప్పుడు చెప్తున్నారు. ఏదేమైనా కోర్టులు, చట్టాలు ఉన్నాయి..ఎవర్ని అన్యాయంగా ఇరికిస్తే ఊరుకోరు. 
- మీరు ఎన్ని కుట్రలు చేసినా... జగన్‌ గారు మీకు లొంగరు.. భయపడరు. 
- సీబీఐ పనికిరాని వ్యవస్థ అని, కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అంటూ సీబీఐని రాష్ట్రంలో బ్యాన్‌ చేసింది ఎవరు.. ఇదే చంద్రబాబు కాదా..?. ఆ రోజు జీవో ఇస్తూ నరేంద్రమోడీ ఎవరు పేరు చెప్తే వారి పేరు పెడతారు అన్నది చంద్రబాబే కదా.. 
- మీకు కావాలంటే సీబీఐ రావాలి..వద్దంటే వెళ్లిపోవాలా..?
- సీబీఐలో చాలా మంది చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారని గతంలో మేం ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు కూడా చేసి వచ్చాం. అక్కడ జరిగేది 20 రోజులు ముందే చంద్రబాబుకి లీక్‌ అవుతుందని ఫిర్యాదు చేశాము. ఆ రోజు జగన్‌ గారి కేసు విషయంలో చార్జ్‌ షీటు బయటకు రాకముందే ఏ పత్రికలో వార్తలు వచ్చేవో అందరికీ తెలుసు. ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో వార్తలు వచ్చిన తర్వాత చార్జ్‌షీట్‌ బయటకు వచ్చేది...అది కూడా మేమే ఇచ్చి రాయించుకున్నామా..?. ఇటువంటి చంద్రబాబు, ఈనాడు, సీబీఐలు మమ్మల్ని ఏమీ చేయలేవు

కన్నా పనికిరాడనే బీజేపీ పక్కన పడేసింది:
- కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కదా ఎన్నికలు జరగాయి..అప్పుడు ఆ పార్టీకి 0.8 శాతం ఓట్లు వచ్చాయి
- అందుకే ఈయన పనికిరాడనే ఆ బీజేపీ వాళ్లు పీకి పక్కన పడేశాడు. 
- వీళ్లను కాటా వేస్తే కేజీ 13 రూపాయలకు కూడా కొనరు. 

చంద్రబాబు చిటెకేసినా...లోకేశ్‌ తప్పెట్లు కొట్టినా లాభం లేదు:
- చంద్రబాబు చిటికేసినా..లోకేశ్‌ తప్పెట్లు కొట్టినా ప్రయోజనం ఏమీ లేదు. వీళ్లద్దరూ కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే అని ప్రజలకు తెలుసు- లోకేశ్‌ మాటలన్నీ మంగళవారం కబుర్లే...
- చంద్రబాబు ఆవేదన అంతా కొడుకును చూసే కానీ రాష్ట్రాన్ని చూసి కాదు
- హైదరాబాద్‌లో ఉండే చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల పట్ల ఆవేదన ఎందుకు ఉంటుంది..?
- "నా మిత్రుడు రాజశేఖరరెడ్డికి పులిలాంటి బిడ్డ పుడితే.. నాకేంటి ఇలాంటి కొడుకు పుట్టాడని" చంద్రబాబు అదేపనిగా ఆవేదన చెందుతున్నాడు. చంద్రబాబుకు లోకేశ్‌ అనే దరిద్రుడు పట్టాడు.
చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఎవరి కోసం ఏడ్చాడు...?. ఆయనెప్పుడూ భార్య కోసం, కొడుకు కోసం మాత్రమే ఏడుస్తాడు..ప్రజల కోసం కాదు. 

 

తాజా వీడియోలు

Back to Top